Webdunia - Bharat's app for daily news and videos

Install App

3జీ సేవలకు టాటా చెప్పనున్న ఎయిర్‌టెల్

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్ముందు 3జీ సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడు, నాలుగేళ్ళలో ఈ సేవలు పూర్తిగా బంద్ కానున్నాయి. అదేసమయంలో 2జీ, 4జీ సేవలను కొ

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (10:24 IST)
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్ముందు 3జీ సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడు, నాలుగేళ్ళలో ఈ సేవలు పూర్తిగా బంద్ కానున్నాయి. అదేసమయంలో 2జీ, 4జీ సేవలను కొనసాగించనుంది. ఈ రెండింటిపై ఎక్కువ పెట్టుబడులు పెట్టనుంది. 
 
ఇదే అంశంపై ఆసంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. రానున్న 3 నుంచి 4 ఏళ్లలో 3జీ సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాటి స్పెక్ట్రమ్ లను 4జీ సర్వీసులకు జత చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు చేయడం లేదని ప్రకటించింది. తమ నెట్ వర్క్‌లో డేటా సామర్థ్యాన్ని మరింత అభివృద్ది చేయడం కోసం 4జీ టెక్నాలజీపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ దక్షిణాసియా, ఇండియా సీఈవో, ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు. 
 
ప్రస్తుతం 3జీ, 4జీ సర్వీసుల కోసం 2100 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లను వాడుతున్నామని... తమ స్పెక్ట్రమ్‌లో ఎక్కువ భాగాన్ని 4జీ సర్వీసులకే కేటాయిస్తున్నామని చెప్పారు. కొన్ని టెలికాం సర్కిళ్లలో అత్యాధునిక 3జీ పరికరాలను అమరుస్తున్నామని... అవి 4జీకి సపోర్ట్ చేస్తాయని తెలిపారు. ఈ పరికరాలను తర్వాత రీప్లేస్ చేస్తామని చెప్పారు. టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకుంటున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments