ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు షాక్.. రూ.49 ప్లాన్ ఇక లేదు

Webdunia
గురువారం, 29 జులై 2021 (13:27 IST)
ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లో ఉన్న రూ.49 ప్లాన్ ను నిలిపివేసింది. దీని స్థానంలో రూ.79 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్లాన్ ధరను ఒకేసారి 60 శాతం పెంచింది ఎయిర్ టెల్. ఇక ధరల పెరుగుదలపై ఎయిర్ టెల్ ప్రతినిధులు మాట్లాడుతూ వినియోగదారుడికి మెరుగైన సేవలు అందించేందుకు ప్లాన్స్‌లో మార్పులు చేశామని తెలిపారు.
 
రూ.79 స్మార్ట్ రీఛార్జితో డబుల్ డేటా, నాలుగు రేట్లు ఎక్కువ అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడవచ్చని తెలిపారు. రూ.79తో రీఛార్జి చేసుకుంటే 200 MB డేటా, రూ.64 టాక్ టైం రానుంది. ఒక సెకనుకు 1 పైసా ఛార్జ్ పడనుంది. ఈ ప్లాన్ కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ ఎస్ఎంఎస్‌లకు కోత విధించారు.
 
ఇక కొన్ని రాష్ట్రాల్లో రూ.49 ప్లాన్ అందుబాటులో ఉంది. వ్యాలిడిటీ తగ్గించి ప్లాన్‌ని కొనసాగిస్తున్నారు. రూ.49 రీఛార్జీతో గతంలో 28 రోజుల వ్యాలిడిటీ వచ్చేది. కానీ ఇప్పుడు 14 రోజులకు కుదించారు. 28 రోజుల వ్యాలిడిటీ రావాలంటే ఖచ్చితంగా రూ.79 స్మార్ట్ రీఛార్జీ చేసుకోవాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments