ఎయిర్‌టెల్ దీపావళి బొనాంజా... జియోకు ధీటుగా కొత్త ఆఫర్

దేశీయ టెలికాం రంగంలో ధరలతో పాటు.. ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. టెలికాం దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో చిన్న ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు.. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (06:11 IST)
దేశీయ టెలికాం రంగంలో ధరలతో పాటు.. ఆఫర్ల యుద్ధం కొనసాగుతోంది. టెలికాం దిగ్గజ కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో చిన్న ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు.. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ మనుగడ ప్రశ్నార్థంగా మారింది. 
 
తాజాగా, ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. జియో ప్ర‌వేశ‌పెడుతున్న ప్ర‌తి ఆఫ‌ర్‌కి కౌంట‌ర్‌గా ఒక కొత్త ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తోంది. ఇప్పుడు కొత్త‌గా పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల కోసం మ‌రో ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. రూ.999కే అపరిమిత లోకల్‌ కాల్స్‌, 50 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తోంది. ఈ ఆఫర్‌ పాత, కొత్త పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు వర్తిస్తుంది. ఇప్పటికే ప్రీపెయిడ్‌ వినియోగదారులకు రూ.999 ప్లాన్‌ అందుబాటులో ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4జీబీ 3జీ/4జీ డేటా, అపరిమిత లోకల్‌ కాల్స్‌ను అందిస్తోంది.
 
దీంతో పాటు ఎయిర్‌టెల్ మ‌రికొన్ని ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. రూ.799 ప్లాన్ పేరుతో 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా, ఉచిత అపరిమిత కాల్స్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ కేవలం ప్రీపెయిడ్‌ వినియోగదారులకు మాత్రమే. దీంతో పాటు 4జీ వినియోగదారుల కోసం రూ.1,399కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగ‌తి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments