ఎయిర్ టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు ఆఫర్స్.. ఉచితంగా కూపన్లు

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (17:46 IST)
ఎయిర్ టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు భారతీ ఎయిర్‌టెల్ సంస్థ మరో ఆఫర్‌ను అందిస్తోంది. పలు ప్రీపెయిడ్ ప్లాన్లను వాడుతున్న వారికి ఉచితంగా డేటా కూపన్లను అందజేస్తోంది. రూ.219, రూ.289, రూ.448, రూ.599 ప్లాన్లను వాడుతున్న వారికి ఈ కూపన్లు లభిస్తాయి. అయితే ఇందుకు గాను ఆయా ప్లాన్లను ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీచార్జి చేసుకోవాలి. దీంతో ఉచిత కూపన్లు వస్తాయి.
 
ఎయిర్‌టెల్ ఆయా ప్లాన్లకు అందించే కూపన్లకు వాలిడిటీ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. కూపన్‌ను రిడీమ్ చేశాక ఒక్క రోజులోగా దానికి అందించే ఉచిత డేటాను వాడుకోవాలి. కాగా రూ.289 ప్లాన్‌లో కస్టమర్లకు నిత్యం 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీనికి 1జీబీ డేటా చొప్పున 2 ఉచిత కూపన్లు వస్తాయి. 
 
కూపన్ల వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. కానీ రిడీమ్ చేస్తే మాత్రం ఒక్క రోజులోనే వాటిని వాడుకోవాలి. డేటాను వాడినా, వాడకున్నా కూపన్‌ను రిడీమ్ చేశాక దానికి ఒక్క రోజే వాలిడిటీ ఉంటుంది.
 
అలాగే రూ.448 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీనికి కూడా 1జీబీ డేటా చొప్పున 2 ఉచిత కూపన్లు వస్తాయి. రూ.599 ప్లాన్‌కు 4 కూపన్లు ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో రోజుకు 3జీబీ డేటా వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments