Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో ప్రతి గ్రామంలోను బ్రాడ్‌బ్యాండ్: సచిన్ పైలట్

Webdunia
బుధవారం, 10 మార్చి 2010 (13:24 IST)
FILE
దేశంలోని 626,000 గ్రామాలలో రానున్న రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని త్వరలో కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగానున్న దాదాపు 626,000 గ్రామాలలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుందని కేంద్ర ఐటీ, సమాచార శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ బుధవారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతి గ్రామాన్ని సాంకేతిక పరంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని గ్రామాలలో బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామన్నారు. దీనికిగాను దాదాపు 3.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని మరింతగా విస్తరించేందుకుగాను దేశంలోని 626,000 గ్రామాలలో 11,000 వేల సమాచార టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దు గ్రాములు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. గ్రామాలలో కనీసం రెండు వందల మంది ప్రజలున్న ప్రాంతాలలో ఇలాంటి టవర్లను ఏర్పాటు చేసేందుకు తాము భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) సంస్థకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే టవర్లు అంతర్జాతీయ సరిహద్దుల్లోనున్న దేశీయ గ్రామాలలో దాదాపు 500 మీటర్ల పరిధిలోకి విస్తరించేలా చర్యలు చేపట్టనున్నామన్నారు. ఇవి అంతర్జాతీయ టెలికం నెట్‌వర్క్స్‌ను కూడా పొందివుంటాయని ఆయన తెలిపారు.

ముఖ్యంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాలనై నాగాలాండ్, త్రిపురా, మిజోరం, అస్సోం ప్రాంతాలలోను వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ టవర్లను ఏర్పాటు చేసేందుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) ద్వారా ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకోనున్నట్లు ఆయన వివరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments