Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ఎట్రాక్షన్: ప్రపంచంలో ఎగబడుతున్న ఉద్యోగులు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2011 (18:42 IST)
ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ పట్టభద్రులు పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న ఉత్తమ కంపెనీగా ఎంపికయింది. 2011 సంవత్సరానికి చేపట్టిన రెండు వేర్వేరు సర్వేల్లో ఉద్యోగార్ధులు గూగుల్ తమకు అత్యంత ఆకర్షణీయమైన కంపెనీ అని పేర్కొన్నారు.

2011 సంవత్సరానికి ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ పట్టభద్రులు పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న టాప్ 50 ప్రపంచ బిజినెస్, ఇంజినీరింగ్ కంపెనీలపై గ్లోబల్ ఎంప్లాయర్ బ్రాండింగ్ సంస్థ యూనివర్సం సర్వే చేపట్టి తయారు చేసిన జాబితాలో గూగుల్ తొలిస్థానాన్ని పొందింది.

తాము పనిచేయడానికి ఆసక్తి చూపుతున్న కంపెనీల గురించి బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, రష్యా, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలకు చెందిన ప్రజలపై చేపట్టిన సర్వేలో ఈ సెర్చ్ ఇంజిన్‌ వైపు మొగ్గుచూపుతున్న వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయింది. యూనివర్శం మూడు సంవత్సరాలుగా ఈవిధమైన సర్వే చేపడుతున్నది.

గూగుల్ తర్వాత స్థానంలో ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీ ఉంది. ఎక్కువ మంది బిజినెస్ స్కూల్స్‌‌ విద్యార్ధులు ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. కాగా ఇంజినీరింగ్ పట్టభద్రులు టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తమ రెండో ప్రాధాన్యమని చెప్పారు.

ఇంజినీరింగ్ విద్యార్ధుల పరంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మూడో స్థానంలో వుండగా కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (నాలుగో స్థానం), చిప్ తయారీదారు ఇంటెల్ (ఐదో స్థానం), ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ (ఆరో స్థానం), టెక్నాలజీ సంస్థ యాపిల్ (ఏడో స్థానం), జీఈ (ఎనిమిదో స్థానం), సీమెన్స్ (తొమ్మిదో స్థానం), కన్జ్యూమర్ గూడ్స్ గ్రూప్ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పదో స్థానం)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇంజినీర్స్ ఇష్టం చూపుతున్న ఇతర టెక్నాలజీ సంస్థల్లో హెచ్‌పీ, సిస్కో, ఒరాకిల్, నోకియా, డెల్, లెనోవోలు ఉన్నాయి. బిజినెస్ విద్యార్ధులు ఆసక్తి కనబరుస్తున్న టాప్ 50 కంపెనీల్లో కేపీఎంజీ తర్వాత ప్రైస్ వాటర్ కూపర్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, డెలాయిట్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను పొందాయి.

బిజినెస్ స్కూల్స్ విద్యార్ధుల ఛాయిస్‌లో మైక్రోసాఫ్ట్ ఆరో స్థానం వుండగా ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఆర్ధిక సేవల సంస్థ జేపీ మోర్గాన్, యాపిల్, ఆర్ధిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్ శాఛ్‌లు వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలను ఆక్రమించాయి. ఇతర ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్ డ్రింక్ దిగ్గజం కోకాకోలా 12వ స్థానంలో వుండగా పెప్సీ కో 30వ స్థానాన్ని పొందింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments