Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభాలు కలిగించే వైవిధ్యమైన అభిషేకాలు!

Webdunia
సాధారణంగా ఆలయాల్లో పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పెరుగు, పసుపు నీళ్లు, పంచామృతాలు... ఇలా వివిధ రకాల పానీయాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే వీటితో కాకుండా తవుడుతో అభిషేకం చేయడం ఎక్కడన్నా విన్నారా? చూశారా?

ఈ అభిషేకం చూడాలంటే కేరళలోని కొడుంగనల్లూరులో ఉన్న భగవతీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఈ ఆలయంలో అమ్మవారికి తవుడుతో అభిషేకం చేస్తారట. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. తవుడుతో అభిషేకం చేయడం ద్వారా అమ్మవారు ఎప్పుడూ శాంతంగా ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.

అంతే కాదు, కుట్రాలంలో ఉన్న కుట్రాలనాథునికి వివిధ రకాల మూలికలు, వేర్ల మిశ్రమంతో తయారైన తైలంతో అభిషేకం నిర్వహిస్తారట. మూలికలు కలిసి ఉండటంతో మంచి ఔషధంగా పనిచేస్తుందని, దీనిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారట.

అలాగే చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న చెంగచేరీ అమ్మవారికి పౌర్ణమి రోజుల్లో గోరింటాకు ఆకులతో అభిషేకం నిర్వహిస్తారట. తర్వాత ఈ ఆకులను కన్యలకు ప్రసాదంగా పంచి పెడతారట. తద్వారా వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

లేటెస్ట్

05-07-2025 శనివారం దినఫలితాలు - ప్రముఖుల సందర్శనం వీలుపడదు...

04-07-2025 శుక్రవారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగులకు జోలికి పోవద్దు

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

Show comments