దేవరగట్టులో అదుపుతప్పిన కర్రల యుద్ధం!

Webdunia
కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతియేడాది కర్రల యుద్ధం జరుగుతుంది. ఇదేంటి.. కర్రల యుద్ధం జరగడమేమిటి? అని ఆశ్చర్య పోతున్నారా? అదే అక్కడి ప్రత్యేకత. దేవరగట్టులో గట్టు మల్లన్న అనే పేరుతో ఆలయం ఉంది. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతియేడాది దసరా పండుగ సందర్భంగా బన్నీ ఉత్సవాలు జరుగుతాయి.

ఈ ఆలయంలో ఉన్న మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల వాసులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కదూ.! ఇక ఇక్కడ నుంచే అసలు కథ ఆరంభమవుతుంది. మల్లన్న విగ్రహాన్ని కైవసం చేసుకునేందుకు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకుంటారు. ఈ దాడుల్లో చిన్నాపెద్దా అనే తారతమ్యం ఉండదు. ఎవరు ఎదురుపడితే వారిని కర్రలతో కొడుతూ ముందుకు దూసుకెళుతారు.

కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఈ ఏడాది నుంచి అరికట్టాలని ప్రభుత్వం, పోలీసులు నిర్ణయించి, పటిష్టమైన బందోబస్తును కల్పించారు. అయితే బన్నీ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. కర్రల యుద్ధంలో యధావిధిగా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో పలువురు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బందోబస్తుకు వచ్చిన పోలీసులు మాత్రం మిన్నకుండి పోయారు. ఆచారమ ా? మజాక ా? అని గ్రామస్థులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?

05-11-2025 బుధవారం ఫలితాలు - మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Show comments