Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరి దైవం నీవమ్మా... నాగులమ్మా

Webdunia
బుధవారం, 7 మే 2008 (17:52 IST)
WD
కోరిన కోర్కెలు నెరవేర్చుకునేందుకు... ప్రజలు తమ ఇష్టదైవాలను పూజిస్తుంటారు. అంతేకాదు తమ కోర్కెలు తీరినందుకు గాను ఆ దేవతలకు తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు అంతా దైవానిదే భారమంటూ ముందుకు సాగుతారు. మన దేశం, రాష్ట్రంలోనూ ఇటువంటి విశ్వాసాలను అనేకం చూడవచ్చు.

కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలంలోని నాగులపేట వాస్తవ్యులు తమ ఇష్టదైవమైన నాగులమ్మను పూజిస్తుంటారు. అంతేకాదు వందేళ్లక్రితం వెలసిన నాగులమ్మ దేవాలయం సాక్షిగా తమ పేర్లను నాగులమ్మ పేరు కలిసివచ్చేటట్లు పెట్టుకోవటం విశేషం. ఇక్కడి నాగులమ్మ దేవాలయానికి అరకిలోమీటరు వరకు నాగదేవతను పోలి ఉన్న రాళ్లు మనకు కనిపిస్తాయి. సుమారు మూడువేల మంది నివాసముంటున్న నాగులమ్మపేటలో అందరి పేర్లు న తో మొదలై ఉండటం విశేషం. అది ఒకప్పటి తరం ఆచరించిన పద్ధతి అనుకుంటే పొరపాటే... నేటికీ వారు ఇదే పద్ధతిని ఆచరిస్తున్నారు.

పిల్లలు కలగని దంపతులు ఇక్కడికి వచ్చి నాగులమ్మకు మొక్కుకుంటారు. దేవత కరుణ ఫలంగా తమ కోర్కెలు నెరవేరుతున్నాయని భక్తులు చెపుతున్నారు. ఫలితంగా ఈ ప్రాంతానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. వారానికోసారి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. మరికొన్ని విశేషాలను వీడియోలో వీక్షించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

Show comments