Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రమైన మాసం రంజాన్ మాసం

Webdunia
హిందూవులు కార్తీక మాసం, వైశాఖ మాసం... అంటూ ఏడాది పొడవునా ఏవో వ్రతాలు ఆచరిస్తూనే ఉంటారు. అయితే ముస్లింలకు మాత్రం అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ నెల వస్తుంది. బక్రీద్ తదితర పండుగుల వచ్చినా, ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం, ముఖ్య పండుగ రంజానే.
రంజాన్ ఉపవాసాలు
  రంజాన్ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు.      

దీనినే ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. అంటే ఉపవాసాన్ని విరమించడం అని అర్థం. ఈ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. కనీసం నోట్లో ఊరే లాలాజలం కూడా మింగరు.

సూర్యాస్తమయం తర్వాత నమాజ్ చేసి దీక్షను విరమించి భోజనం చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ నమాజ్‌తో దీక్షను ప్రారంభిస్తారు. రంజాన్ నెలలోనే తమ పవిత్ర గ్రంథమైన "ఖురాన ్" దివి నుంచి దైవదూత భువికి తీసుకువచ్చారని ముస్లంల నమ్మకం.

రంజాన్ నెల చివరి పది రోజుల్లో ఓ రోజు ఈ గ్రంథం భూమి మీదకి వచ్చిందని వారు విశ్వసిస్తారు. ఆ సమయంలో "అల్ల ా" ముస్లింలకు కొన్ని నిబంధనలు విధించారని వారు చెప్తారు. డబ్బున్న వారు, ధనవంతులు పేదవారికి సాయం చేయాల్సి ఉంటుంది. కనీసం నిత్యావసరాలు కూడా లేకుండా కష్టపడే వారికి దానాలు చేసి వారిని ఆదుకోవాలి.

అయితే అప్పుగా మాత్రం ఇవ్వ కూడదు. ఆహారం, దుస్తులు, డబ్బు తదితరాలు దానంగా ఇవ్వచ్చు. కనుకనే ఈ నెలలో ముస్లింలు విరివిగా దానాలు చేస్తారు. వారు సంపాదించిన దానిలో సగం దానం చేసేందుకే ఉపయోగిస్తారు. అయితే మైలు తదితరాలు వచ్చిన వారు మాత్రం తమ రోజాలను (ఉపవాసాలు) ఆపేస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments