Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖురాన్' ఆవిర్భవించిన "రంజాన్" మాసం 12న ఆరంభం!

Webdunia
FILE
మహమ్మదీయుల పవిత్ర గ్రంథం "ఖురాన్" ఆవిర్భవించిన పుణ్యమాసం రంజాన్... ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. "రంజాన్ లేగా రమదాన్" అని పిలిచే ఈ మాసంలో మహమ్మదీయులు ఉపవాస దీక్షను ఆచరిస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్ఠ నియమాలతో గడిపే ఈ మాసం ఇస్లామ్ కేలండర్‌లో ఒక నెలపేరు. ఇది ఇస్లామ్ కేలండర్ నెలల క్రమంలో తొమ్మిదోది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట భోజనం పెడితే ఆ అల్లా 1000 పూటల ఆహారం ప్రసాదిస్తాడని విశ్వాసం.

ముస్లిం సోదరులు ఈ మాసమంతా ఉపవాస దీక్షను పాటించి మాస చివరన అత్యంత పవిత్రంగా "రంజాన్" పండుగను జరుపుకుంటారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం 'ఉపవాసవ్రతం'. ముస్లిం సోదరులు కూడా 'చాంద్రమాన కేలండర్'ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల 'రంజాన్'‌గా పరిగణింపబడుతోంది.

రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసేవరకూ ముస్లింలు పగలు నిష్టగా ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానివేయడంతో పాటు నిష్ట నియమాలతో కూడుకున్న జీవితం గడుపుతారు. తెల్లవారుజామున మాత్రమే ఆహారం తీసుకుని రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీక్షను విరమిస్తారు.

తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని "సహర్" అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని "ఇఫ్తార్" అని అంటారు. రంజాన్ నెలలో ప్రతిరోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు కఠిన ఉపవాసదీక్షలు పాటిస్తారు. ఉపవాసదీక్ష పాటించేవారు అసత్యాలు ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడుపుతారు. ఇంకా శారీరక, మానసిక వాంఛలకు దూరంగా ఉంటూ నిగ్రహంతో దైవచింతనతో గడుపుతూ వుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

Show comments