Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పరుగుల కింగ్" విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (17:31 IST)
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. ఐసీసీ ట్వంటీ20 ప్రపచం కప్ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు పుటలకెక్కాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‍లో కోహ్లీ వ్యక్తిగతంగా 16 పరుగులు చేయడంతో ఈ అరుదైన ఫీట్‌ను తన సొంతం చేసుకున్నాడు. 
 
ఇప్పటివరకు ఆ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే ఉన్నాడు. ఈయన మొత్తం 1016 పరుగులు చేశాడు. ఇపుడు ఆయన్ను వెనక్కినెట్టి విరాట్ కోహ్లీ ఆక్రమించాడు. ప్రస్తుతం కోహ్లీ 1065 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. 
 
జయవర్థనే మొత్తం 31 ఇన్నింగ్స్‌లలో 1016 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 25 ఇన్నింగ్స్‌లలో 1065 పరుగులు చేయడం గమనార్హం. ఈ మెగాటోర్నీలోనే మరికొన్ని మ్యాచ్‌లలో కోహ్లీ ఆడాల్సి ఉండటంతో మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరిన్ని పరుగులు చేసే అవకాశం లేకపోలేదు.
 
కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లో కోహ్లీ 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమే కాకుండా, మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై 62 పరుగులు, సౌతాఫ్రికాపై 12, బంగ్లాదేశ్‌పై 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, ఈ టోర్నీలో కోహ్లీ ఇప్పటివరకు ఏకంగా 273 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments