Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో దిట్ట.. మహీ తప్పులు చేశాడు..

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (12:47 IST)
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. కానీ విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సిరీస్‌లో ధోని కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెరుగ్గా ఉన్నాడని భారత మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ అన్నాడు. 
 
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ టోర్నీ సిరీస్‌లో ధోని కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెరుగ్గా ఉన్నాడు. రోహిత్ సారథ్యంలో ముంబై జట్టు ఒక్క పరుగు తేడాతో రెండుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. 
 
కెప్టెన్‌గా మైదానంలో కీలక సమయాల్లో ఓపిక పట్టకపోతే ఇంతటి విజయాన్ని సాధించడం సాధ్యం కాదు. ఇలాంటి పోటీలో ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే గత పదేళ్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో తప్పు చేయడం ఎప్పుడూ చూడలేదు.
 
అయితే ధోనీ కెప్టెన్సీలో తప్పులను చూడవచ్చు. కీలక సమయాల్లో పవన్ నేగి లాంటి అనుభవం లేని ఆటగాళ్లకు బౌలింగ్ అవకాశాలు ఇవ్వడం ద్వారా ధోనీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ మైదానంలో దానిని అమలు చేయడంలో రోహిత్ శర్మ దిట్ట... అంటూ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments