సంజు శాంసన్‌కు రూ.24లక్షల జరిమానా.. ఎందుకంటే?

సెల్వి
గురువారం, 10 ఏప్రియల్ 2025 (10:25 IST)
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆట సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా, సంజు శాంసన్‌‌పై రూ.24 లక్షల జరిమానా విధించింది.
 
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించబడటం ఇది రెండోసారి. గతంలో, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇదే ఉల్లంఘనకు స్టాండ్-ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది.
 
ఇటీవల గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో, మిగిలిన జట్టు సభ్యులకు కూడా బీసీసీఐ జరిమానా విధించింది. ప్రతి ఆటగాడికి వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. మ్యాచ్ సమయంలో జట్టు అన్ని అంశాలలోనూ పేలవ ప్రదర్శన చేసిందని సంజు శాంసన్ అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

తర్వాతి కథనం
Show comments