Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మజా చూపిన తొలి మ్యాచ్: నెహ్రా, రషీద్, యువరాజ్ రికార్డుల మోత

అదిరందయ్యా చంద్రం అన్నట్లు ఐపీఎల్ 10 ఆరంభమే బ్యాట్స్‌మెన్ ఉతుకుడుకు, బౌలర్ల నియంత్రణకు సమాన స్థాయిలో ప్రాధాన్యతనిచ్చింది. 23 బంతుల్లో అర్ధ సెంచరీతో యువరాజ్ వీర విజృంభణ, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ టీ20ల్లో 100 క్యాచ్‌లు పట్టిన

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (02:59 IST)
అదిరందయ్యా చంద్రం అన్నట్లు ఐపీఎల్ 10 ఆరంభమే బ్యాట్స్‌మెన్ ఉతుకుడుకు, బౌలర్ల నియంత్రణకు సమాన స్థాయిలో ప్రాధాన్యతనిచ్చింది. 23 బంతుల్లో అర్ధ సెంచరీతో యువరాజ్ వీర విజృంభణ, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ టీ20ల్లో 100 క్యాచ్‌లు పట్టిన ఘనత, ఐపీఎల్‌లో చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి ఎడమచేతి వాటం బౌలర్‌గా ఆశిష్ నెహ్రా రికార్డు,సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న అరంగేట్రం బౌలర్‌ రషీద్‌ఖాన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి వికెట్‌ తీయడం కళ్లముందు కొత్త సినిమాలా కళాత్మకంగా సాగిపోయిన తొలిమ్యాచ్ హాజరైన 40 వేలమంది ప్రేక్షకులకు పూర్తి సంతృప్తి నిచ్చింది. తొలి మ్యాచ్ హైలెట్స్ చూస్తే.
 
 
గత ఏడాది సన్‌రైజర్స్‌ తరఫున అంతంత మాత్రంగానే ఆడిన యువరాజ్‌ ఈ సీజన్‌లో శుభారంభం చేశాడు. ముఖ్యంగా అతని హుక్‌ షాట్లు అభిమానులను అలరించాయి. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి ఫోర్‌ బాదిన యువీ, ఆ తర్వాత అనికేత్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 కొట్టాడు. 26 పరుగుల స్కోరు వద్ద అదే ఓవర్లో తాను ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో అరవింద్‌ వదిలేయడం కూడా యువరాజ్‌కు కలిసొచ్చింది. అరవింద్‌ బౌలింగ్‌లోనే మరో సిక్సర్‌ బాదిన యువీ ఈ క్రమంలో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఐపీఎల్‌లో ఇదే వేగవంతమైన హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. 2015 సీజన్ తర్వాత యువరాజ్‌కు ఐపీఎల్‌లో ఇదే మొదటి హాఫ్‌ సెంచరీ కావడం విశేషం.
 
గత ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌తో ఆడి, కెప్టెన్‌గా జట్టుకి కప్పుని అందించిన వార్నర్‌ ఈసారి ధాటిగా ఆట మొదలుపెట్టాడు. ఈ ఐపీఎల్‌లో మొదటి బంతిని ఎదుర్కోవడంతో పాటు మొదటి సిక్సర్‌, మొదటి ఫోర్‌ కొట్టిన ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు. మొదట ఔట్‌ అయిందీ తనే! సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న అరంగేట్రం బౌలర్‌ రషీద్‌ఖాన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి వికెట్‌ తీసుకున్నాడు. ఆఫ్గానిస్థాన్‌కు చెందిన ఈ బౌలర్‌ సన్‌రైజర్స్‌ జట్టు తరఫు నుంచి కూడా తొలి వికెట్‌ తీయడం.. అదీ తాను వేసిన తొలి ఓవర్‌లోనే కావడం గమనార్హం. 
 
సన్‌రైజర్స్‌ బౌలర్‌ నెహ్రా ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే రికార్డు సాధించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ అరవింద్‌ వికెట్‌ తీయడంతో ఐపీఎల్‌లో చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి ఎడమచేతి వాటం బౌలర్‌గా రికార్డు సాధించాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ టీ20ల్లో 100 క్యాచ్‌లు పట్టిన ఘనత సాధించాడు. దీపక్‌ హుడా బౌలింగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ క్యాచ్‌ను అందుకోవడంతో 100 క్యాచ్‌ల క్లబ్‌లో చేరాడు.
 
అఫ్గనిస్థాన్‌కు చెందిన లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌ను చాలామంది అర్థంచేసుకోలేరని రెండు రోజుల క్రితం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ధావన్‌ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. అరంగేట్ర మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌లోనే బెంగళూరు మొదటి వికెట్‌ తీసి అబ్బురపరిచాడు. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ మన్‌దీప్‌సింగ్‌(24)ను బౌల్డ్‌ చేసి ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో రూ.4కోట్లకు రషీద్‌ను హైదరాబాద్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణాటకలో భార్య వేధింపులు.. కొడుతోంది నాన్నా.. చనిపోతున్నా.. భర్త ఆత్మహత్య

వైకాపా మాజీ నేతలు స్వలాభం మానుకోవాలి : నాగబాబు హితవు (Video)

15ఏళ్లలో నలుగురిని పెళ్లాడిన మహిళ.. పేర్లు మార్చుకుని పెళ్లయ్యాక జంప్!

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

తర్వాతి కథనం
Show comments