Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలింగాను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ జట్టు

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (18:40 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 కోసం జరిగిన వేలం పాటలో... శ్రీలంక స్టార్ బౌలర్ మలింగాను ముంబై ఇండియన్స్ జట్టు రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2019వ ఏడాదిగానూ ఆడే క్రికెటర్లను ఎంపిక చేసుకునే ప్రక్రియ జైపూరులో ప్రారంభమైంది.


12వ ఐపీఎల్ సీజన్‌గా జరుగనున్న ఈ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనే 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో మలింగాను ముంబై రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 
 
ఇదే తరహాలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రన్‌ను రూ. 7.20 కోట్లతో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫాంచైజీ సొంతం చేసుకుంది. దీంతో కుర్రన్ ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కోలిన్ ఇంగ్రామ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.40 కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను రూ.4.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది కింగ్స్ లెవెన్ పంజాబ్. ట్రినిడాన్ ఆండ్ టొబాగోలో సభ్యుడైన ఇతను జాతీయ జట్టులో ఆడకపోయినా పంజాబ్ జట్టు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. 
 
సర్పరాజ్ ఖాన్ రూ.25 లక్షలకు కైవసం చేసుకున్న పంజాబ్ ఫ్రాంచైజీ
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా రూ.1కోటి బేస్ ప్రైజ్‌తో ఎవ్వరూ దక్కించుకోలేదు.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కూడా అమ్ముడుపోలేదు.
టీమిండియా స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మను రూ.1.1 కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. 
ఇండియన్ టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇతను రూ.1.2 కోట్లు పలికాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments