బౌలర్లపై చెరగని విశ్వాసమే విజయ కారణం: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ

ఉత్కంఠ భరిత క్షణాల్లో బౌలర్లపై ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచుతుంటానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. హైదరాబాద్ నగరం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-10 టోర్నీలో అతి స్వల్పస్కోరును కాపాడుకుని పుణె

Webdunia
సోమవారం, 22 మే 2017 (04:26 IST)
ఉత్కంఠ భరిత క్షణాల్లో బౌలర్లపై ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచుతుంటానని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. హైదరాబాద్ నగరం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-10 టోర్నీలో అతి స్వల్పస్కోరును కాపాడుకుని పుణె సూపర్ జెయింట్స్‌పై అద్భుత విజయాన్ని సాధించడంలో రోహిత్ శర్మ తన బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి కలిగించకుండా ప్రశాంతంగా ఉంచడమే విజయానికి కారణమని చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 8 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్వల్ప స్కోరు సాధించడంతో ప్రత్యర్థి రైజింగ్ పుణె సూపర్ జెయింట్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. ఈ అంచనాకు తగ్గట్టుగానే 10 ఓవర్ల వరకు కెప్టెన్ స్మిత్, అంజింక్యా రహానే నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని ఖాయం చేసినట్లే అంతా భావించారు. 
 
 
కానీ 11 ఓవర్‌లో అజింక్యా రహానే ఔట్ కాగానే గేమ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. స్మిత్, అనుభవజ్ఞుడు ధోనీ ఇద్దరూ క్రీజులో ఉన్నప్పటికీ అయిదు ఓవర్లవరకూ పుణె జట్టు ఒక్క ఫోర్ కూడా సాధించలేకపోయింది. ముంబై బౌలర్లు ఎంత కట్టుదిడ్టంగా బంతులేశారంటే, చూస్తుండగానే పుణె సాధించాల్సిన రన్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది. 13 బంతులాడి కేవలం 10 పరుగులనే చేసిన ధోనీ ఉన్నట్లుండి ఔట్ కావడంతో పుణె కోలుకోలేకపోయింది. స్మిత్ ఒక్కడు చివరి ఓవర్ వరకూ పోరాడి అర్థ సెంచరీ సాధించినప్పటికీ డెత్ ఓవర్లలో మలింగా, బూమ్రా, మిచెల్ జాన్సన్‌లు గేమ్‌ను శాసించారు. దీంతో చివరివరకు విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్‌లో పుణె 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో టైటిల్‌కు దూరమైంది. 
 
పదేళ్ల ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ సేన తర్వాత మాట్లాడుతూ పిచ్ కాస్త అనుకూలంగా ఉండటంతో తమ బౌలర్లు పరిస్థితిని తమకు పూర్తి అనుకూలంగా మల్చుకున్నారని కితాబిచ్చాడు. విజయం అటూ ఇటూ దోబూచులాడుతుండగా చివరి మూడు ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లోనూ తన బౌలర్లపై పూర్తి విశ్వాసం ఉంచానని చెప్పాడు.

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ మా బౌలర్లు తమ పనిని సమర్థంగా నిర్వహించారు. వారికి కావలసిందల్లా స్వేచ్ఛగా అడే అవకాశం కల్పించడమే. ఎందుకంటే వారు నిజంగానే ప్రతిభావంతులు. గతంలో ఎన్నోసార్లు వారు తామేంటో నిరూపించుకున్నారు. ఫైనల్లో కూడా వారు ఏం కోరుకుంటే అలాగా ఫీల్డ్‌ను మార్చుతూ పోయాను. అందుకే చివరి బంతి వరకూ విజయం దోబూచులాడినప్పటికీ మా బౌలర్లే నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లోనూ నిబ్బరం కోల్పోకుండా ఆడి గెలుపును సాధించిపెట్టారు అంటూ రోహిత్ ప్రశంసించాడు.
 
ముంబై ఇండియన్స్ జట్టు మెంటర్ సచిన్ టెండూల్కర్ తక్కువ స్కోరును తట్టుకుని తమ జట్టు గెలవడం సింప్లీ అమేజింగ్ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ప్రథమార్థం మాకు ఏమాత్రం అనుకూలంగా లేదు. కాని పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాం. తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లోనూ అద్వితీయమైన బౌలింగ్, గొప్ప ఫీల్డింగ్ అనే రెండు అంశాలే మాకు విజయాన్ని అందించాయని సచిన్ వివరించాడు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో వ్యక్తితో సన్నిహితంగా వుంటోందని వివాహితను హత్య చేసిన మొదటి ప్రియుడు

రూ.2.7 కోట్ల విలువైన 908 కిలోల గంజాయి స్వాధీనం.. ఎలా పట్టుకున్నారంటే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తా : బండి సంజయ్

Jagan: బాలయ్య మద్యం మత్తులో అసెంబ్లీలో మాట్లాడారు.. వైఎస్ జగన్ ఫైర్ (video)

వైఎస్ వివేకా హత్య కేసు : అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి : వైఎస్ సునీత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

తర్వాతి కథనం
Show comments