Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11.. స్పాన్సర్‌గా చైనా కంపెనీ.. చివరికి ఏమైందంటే?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (11:03 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 అనే కంపెనీ ఎంపికైన సంగతి తెలిసిందే. ఎంపికైన గంటల వ్యవధిలోనే కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ఆ దేశానికి చెందిన వివో కంపెనీని టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి తప్పించిన బీసీసీఐ.. బిడ్స్ ఆహ్వానించి డ్రీమ్ 11కి మంగళవారం స్ఫాన్సర్‌షిప్‌ని ఇచ్చింది. 
 
రూ.222 కోట్లకి బిడ్‌ని దాఖలు చేసిన డ్రీమ్ 11కి స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌, గత కొన్నేళ్లుగా ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటిగా ఉండటం కలిసొచ్చింది. బిడ్స్ దాఖలు చేసిన బైజూస్, అన్అకాడమీ సంస్థల్ని పక్కనపెట్టి డ్రీమ్ 11కి ఐపీఎల్ 2020 స్ఫాన్సర్‌షిప్‌ని బీసీసీఐ కట్టబెట్టిన గంటల వ్యవధిలోనే డ్రీమ్ 11లో చైనా పెట్టుబడులు ఉన్నాయనే వార్త వెలుగులోకి వచ్చింది. చైనాకి చెందిన టెన్సెంట్ కంపెనీ.. డ్రీమ్ 11లో పెట్టుబడులు పెట్టినట్లు తేలడంతో.. మళ్లీ వివాదం రాజుకుంది. 
 
ఈ డ్రీమ్ 11లో వాటాదారులు, ఉద్యోగులు (400 మంది) భారతీయులేనని వివరణ ఇచ్చిన ఆ సంస్థ.. చైనాకి చెందిన టెన్సెంట్ కేవలం 10 శాతం లోపే పెట్టుబడులు పెట్టిందని చెప్పుకొచ్చింది. దీంతో వివాదం సమసిపోయినట్లు కనిపిస్తున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments