Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యర్థి వేదికపై సన్‌రైజర్స్‌ తొలి పరాజయం: బుమ్రా, బజ్జీ దెబ్బకు విలవిల

వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ గెలుపొందింది. పదో సీజన్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇది తొలి ఓటమి.

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (02:22 IST)
వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ గెలుపొందింది. పదో సీజన్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇది తొలి ఓటమి. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నితీశ్‌ రాణా(45: 36 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి ముంబయి ఇండియన్స్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. పార్థీవ్‌ పటేల్‌(39: 24 బంతుల్లో 7×4), కృనాల్‌ పాండ్య(37: 20 బంతుల్లో 3×4, 3×6) మెరుగైన ప్రదర్శన చేయడంతో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబయి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది.
 
 
సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఉత్సాహంతో కనిపించిన డిఫెండింగ్‌ చాంపియన్‌కు ప్రత్యర్థి వేదికపై పరాజయం పలకరించింది. బయటి మైదానంలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే బ్యాటింగ్‌ వైఫల్యంతో హైదరాబాద్‌ ఓటమిని ఆహ్వానించింది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో సన్‌రైజర్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమై, ఆ తర్వాత దానిని కాపాడుకోవడంలోనూ విఫలమైంది. వాంఖెడే గడ్డపై ముందుగా బుమ్రా, హర్భజన్‌ బౌలింగ్‌తో రైజర్స్‌పై పట్టు బిగించిన ముంబై ఇండియన్స్‌... పార్థివ్, రాణా, కృనాల్‌ల బ్యాటింగ్‌తో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.  
 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ అంశం ఓపెనింగ్‌ భాగస్వామ్యం మాత్రమే. వార్నర్, ధావన్‌ తొలి వికెట్‌కు 62 బంతుల్లో 81 పరుగులు జోడించారు. తర్వాతి బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో 50 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయి రైజర్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. బుమ్రా(3/24), భజ్జీ(2/23) సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బతీశారు. మలింగ,మెక్లనగాన్‌, హర్డిక్‌ పాండ్య తలో వికెట్‌ తీశారు.
 
సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నితీశ్‌ రాణా(45: 36 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి ముంబయి లక్ష్యాన్ని ఛేదించింది. పార్థీవ్‌ పటేల్‌(39: 24 బంతుల్లో 7×4), కృనాల్‌ పాండ్య(37: 20 బంతుల్లో 3×4, 3×6) మెరుగైన ప్రదర్శన చేయడంతో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబయి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది. లక్ష్యం తక్కువగా ఉండటంతో ముంబయి బ్యాట్స్‌మెన్లు నిలకడగా, ఆచీతూచీ ఆడుతూ వచ్చారు. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్కోరు బోర్డు కూడా లక్ష్యాన్ని చేరుకుంది. 
 
వార్నర్‌ బ్యాటింగ్‌ ఎలా సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక పెద్ద అంపైరింగ్‌ పొరపాటు చోటు చేసుకుంది. బుమ్రా వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతిని వార్నర్‌ ఫోర్‌గా మలిచాడు. తర్వాతి ఓవర్‌ తొలి బంతిని వాస్తవంగా ధావన్‌ ఎదుర్కోవాలి. అయితే మెక్లీనగన్‌ వేసిన ఏడో ఓవర్‌ తొలి బంతిని కూడా వార్నరే ఆడాడు. అంపైర్‌ ఈ పొరపాటును గుర్తించకపోవడంతో ఆట సాగిపోయింది!
 
కోల్‌కతాలో శనివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments