Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్‌కే విజిల్‌ పోడు... జీవా అదుర్స్... ధోనీనే విలువైన ఆటగాడు

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (22:40 IST)
ఐపీఎల్‌ 2021లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని కూతురు జీవా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. సీఎస్‌కే జట్టు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజిల్‌ పోడు.. సెకండ్‌ఫేజ్‌ ప్రారంభంలో ధోని నాయకత్వంలోని సీఎస్‌కే విజిల్‌ పోడు అనే అంశాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చి తమ ప్రమోషన్‌కు వాడుకుంది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్‌ అయింది.
 
తాజాగా ధోని కూతురు జీవా కూడా మ్యాచ్‌ మధ్యలో విజిల్‌ వేస్తూ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. చేతిలో ఈల పట్టుకొని సాక్షిధోని పక్కన నిల్చొని విజిల్‌ వేస్తూ ఉత్సాహంగా కనిపించింది. జీవా ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఇకపోతే, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎం.ఎస్‌. ధోనీ.. ఐపీఎల్‌లో ఇప్పటికీ అత్యంత విలువైన ఆటగాడిగా కనిపిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ అన్నాడు. వయసు పైబడుతుంటడంతో ధోనీ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నా.. జట్టులో కెప్టెన్‌గా ఎంతో కీలకంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
 
ఐపీఎల్‌-14 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటికే ఎనిమిది విజయాలు సాధించి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గురువారం జరుగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య జరగనుంది. ఇందులో ధోనీసేన విజయం సాధిస్తే.. అధికారికంగా ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments