Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ప్లేయర్‌కు కరోనా: ఐపీఎల్‌పై కరోనా పిడుగు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (16:19 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్-2పై కరోనా పిడుగు పడింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ -2 ప్రస్తుతం విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఐపీఎల్‌ టోర్నీపై మరో సారి కరోనా పిడుగు పడింది. ఇవాళ కరోనా పరీక్షల్లో ఓ ఆటగాడికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు.

అయితే.. ఆటగాడి పేరు మాత్రం ప్రకటించలేదు. సన్‌ రైజర్స్‌ బౌలర్‌ నటరాజన్‌ అని తెలుస్తోంది. నటరాజన్‌‌తో సహా పలుగురిని ఐసోలేషన్‌‌కు పంపింది యాజమాన్యం. దీంతో ఆటగాళ్లలో మళ్లీ టెన్షన్‌ నెలకొంది.
 
కాగా.. ఐపీఎల్‌ 2021లో ఇవాళ ఢీల్లి క్యాపిటల్స్‌తో.. సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దుబాయి వేదికగా రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆడుతున్న ప్రతి మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండగా.. కుర్రాళ్లతో పటిష్టంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టబోతుంది సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్, మరియు ఢిల్లీ క్యాపిట్స్‌ మధ్య మ్యాచ్‌ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది బీసీసీఐ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments