ఐపీఎల్‌పై సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్ స్ఫూర్తిగా అవి ఏర్పడ్డాయి?

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:48 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఐపీఎల్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ కేవలం డబ్బుకోసమేనా? అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడం తప్ప ఇంకేమీ చేయలేదా అంటే కాదనే అంటోంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవెలెప్‌మెంట్ అండ్ పీస్ సందర్భంగా పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన వర్చువల్ ప్యానల్ చర్చలో సానియా మీర్జా పాల్గొని క్రీడలకు సంబంధించిన విషయాలు వివరించింది.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఐపీఎల్ ద్వారా ఎంతో ప్రతిభ వెలుగులోకి వస్తుంది.. గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారులకు ఇది ఒక మంచి వేదికను కల్పిస్తుందని సానియా చెప్పింది. వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రపంచంలోని మేటీ క్రికెటర్లతో కలసి ఆడేందుకు, వారితో పోటీ పడేందుకు బీసీసీఐ మంచి వేదికను కల్పించిందని సానియా ప్రశంసించింది. 
 
ఇక ఐపీఎల్‌ను స్పూర్తిగా తీసుకొనే బ్యాడ్మింటన్ లీగ్, కబడ్డీ లీగ్, టెన్నిస్ లీగ్, హాకీ లీగ్, ఫుట్‌బాల్ లీగ్ వంటివి ఏర్పడ్డాయి. దీని ద్వారా ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి చాటగలుగుతున్నారని సానియా చెప్పింది. 'పరాజయం నుంచి ఎలా తేరుకోవాలి.. ఎలా పైకి రావాలో ఆటలు నేర్పిస్తాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యం క్రీడల వల్లే సాధ్యమవుతుంది' అని సానియా మీర్జా వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments