ధోని కెప్టెన్‌గా హీరో.. బ్యాటింగ్‌లో మాత్రం జీరో.. ఆకాష్ చోప్రా

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (17:37 IST)
చెన్నై సూపర్ కింగ్స్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 10 మంది ఆటగాళ్ళతో పాటు ఒక కెప్టెన్‌తో మాత్రమే ఆడుతుందని.., ధోని వల్ల చెన్నై బ్యాటింగ్ లైనప్‌కి ఎలాంటి ఉపయోగం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
 
కేవలం కీపర్‌గా, కెప్టెన్‌గా మాత్రమే ధోని చెన్నై జట్టుకి సేవలు చేస్తున్నాడని.. ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్‌లలో 11.40 యావరేజ్‌తో 66 పరుగులతో పేలవ ప్రదర్శన కనబరిచాడని చెప్పుకొచ్చాడు. అయితే ధోని కెప్టెన్సీ వల్లనే చెన్నై ఘనవిజయాలు సాధించిందని.. కెప్టెన్ గా ధోని ప్రతిభావంతుడని..ఇటీవలే సాహా క్యాచ్‌తో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లను అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడని కామెంట్ చేశాడు.
 
ప్రస్తుత ఐపీఎల్‌లో ధోని కెప్టెన్‌గా హీరో అయిన.. బ్యాటింగ్‌లో మాత్రం జీరో అన్నట్లుగా.. ఒకవైపు కెప్టెన్‌గా, కీపర్‌గా ధోని సేవలను ప్రశంసించడమే మరోవైపు ధోని బ్యాటింగ్ గురించి సెటైర్లు వేయడంతో మిస్టర్ కూల్ అభిమానులు హాట్ హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో ఆకాష్ చోప్రాపై విరుచుకుపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలింపు.. భార్య సూసైడ్... మనస్తాపంతో భర్త కూడా

Kavitha: ఆంధ్ర రాజకీయ నాయకులు మాటలు నచ్చవు.. అదేంటి అలా తిట్టుకోవడం?

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments