Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్కే జట్టు కోచ్‌కు కరోనా.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలింపు...

Webdunia
గురువారం, 6 మే 2021 (17:37 IST)
బయో బబుల్‌లో ఉంటూ వచ్చిన ఐపీఎల్ క్రికెటర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో 14వ సీజన్ పోటీలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వారిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్ మైఖేల్ హస్సీ, బౌలింక్ కోచ్ లక్ష్మీపతి బాలాజీలు వున్నారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి మంరింత ఆందోళనకరంగా ఉండటంతో వీరిని ఎయిరి అంబులెన్స్‌ ద్వారా ఢిల్లీ నుంచి చెన్నైకు తరలించారు. 
 
దీనిపై చెన్నై ఫ్రాంచైజీ అధికారి ఒకరు స్పందిస్తూ, తమకు చెన్నైలో విస్తృతస్థాయిలో పరిచయాలు ఉన్నాయని, తద్వారా వారిద్దరికీ మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించగలమని భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతానికి హస్సీ,  బాలాజీకి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని, వారిద్దరూ బాగానే ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ముందు జాగ్రత్త చర్యగా వీరిని సురక్షితంగా చెన్నైకు తరలించినట్టు చెప్పారు. ఆస్ట్రేలియా జాతీయుడైన మైఖేల్ హస్సీ కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాడని, నెగెటివ్ సర్టిఫికెట్ వస్తే భారత్‌ను వీడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లు భారత్‌ను వదిలి వెళ్లేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments