Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ కోసం థీమ్ సాంగ్... ఆయేంగే హమ్ వాపస్ అంటూ...

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (08:38 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు సరిగ్గా మరో పది రోజుల్లో ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పోటీలను యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేయగా, అన్ని జట్లూ ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో క‌రోనాపై పోరాటం చేస్తూ ఈ టోర్నీ మ‌ళ్లీ భార‌త్‌లోనే నిర్వ‌హించ‌బ‌డుతుంద‌నే ఆత్మ‌విశ్వాసంతో నిండిన ఓ థీమ్ సాంగ్‌ను ఐపీఎల్ యాజమాన్యం రిలీజ్ చేసింది. ఈ పాట‌కు క్రికెట్ అభిమానుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తుండ‌గా.. 'అయేంగే హ‌మ్ వాప‌స్' అనే లిరిక్స్‌తో సాగిన ఈ పాట ఆద్యంతం క్రికెట్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. 
 
ఇదిలావుండగా, ఇటీవలే ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19వ తేదీన చెన్నై - ముంబై జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం యూఏఈలో అడుగుపెట్టిన 8 జట్ల ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. ఎన్నో ఒడిదొడుకుల‌ను దాటి క‌రోనా క‌ష్ట‌కాలంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వ‌హిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

తర్వాతి కథనం