Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వెన్ను విరిచిన బూమ్రా... ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (08:28 IST)
యూఏఈ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పోయించారు. ఈ మ్యాచ్‌లో బూమ్రా దెబ్బకు ఢిల్లీ జట్టు చిగురుటాకులా వణికింది. ఫలితంగా 54 పరుగుల తేడాతో ముంబై జట్టు విజయభేరీ మోగించింది. తద్వారా రాజమార్గంలో ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ముంబై చేతిలో ఢిల్లీ ఓడినప్పటికీ.. మరో అవకాశం ఉంది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలుపొందిన వారితో ఢిల్లీ తలపడనుంది.
 
ఊహించినదే అయింది. ఐపీఎల్‌ 2020లో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి దర్జాగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఓడిన ఢిల్లీకి మాత్రం మరో అవకాశం ఉంది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి బంతి నుంచే వీరకుమ్ముడు మొదలుపెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్‌లు డకౌట్ అయినా, మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం చెలరేగిపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చివర్లో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 14 బంతుల్లో 5 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.
 
ఇక డికాక్ 40 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ (51), ఇషాన్ కిషన్ (55, నాటౌట్)లు అర్థ సెంచరీలతో అదరగొట్టారు. కృనాల్ పాండ్యా 13 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, నార్జ్, స్టోయినిస్ చెరో వికెట్ తీసుకున్నారు. డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాల వీర విహారంతో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 143 పరుగులు మాత్రమే చేసి 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికి పృథ్వీషా, ఐదో బంతికి అజింక్య రహానేలు డకౌట్ అయ్యారు. ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికి శిఖర్ ధవన్ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.
 
ఇలా ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ ఓటమి అప్పుడే ఖాయమైంది. దీనికితోడు ముంబై బౌలర్లు మరింతగా పట్టు బిగించడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ వణికిపోయారు. పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు. 
 
స్టోయినిస్, అక్సర్ పటేల్ మాత్రం బౌలర్లను కాసేపు ఎదురొడ్డినా అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే పరిమితమైంది. 46 బంతులు ఎదుర్కొన్న స్టోయినిస్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేయగా, అక్సర్ పటేల్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు.
 
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 12, రబడ 15 పరుగులు చేశారు. డేనియల్ శామ్స్ డకౌట్ అయ్యాడు. ఢిల్లీ జట్టులో మొత్తం నలుగురు ఆటగాళ్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరడం గమనార్హం. చివరికి 20 ఓవర్లలో 143/8 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. 
 
ముంబై బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ 2, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్ చెరో వికెట్ తీసుకున్నారు. నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన జస్ప్రిత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments