Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-2020.. చెన్నై తరపున హర్భజన్ సింగ్ ఆడుతాడో? లేదో? (video)

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (13:20 IST)
ఐపీఎల్-2020కి కరోనా వైరస్ ఇబ్బందులు కలిగిస్తోంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కరోనా కష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే ఆ జట్టులో 13మందికి కరోనా పాజిటివ్ వున్నట్లు తేలింది. అలాగే సురేష్ రైనా కూడా వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్‌ 2020కి దూరమయ్యాడు. 
 
తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ కూడా ఈసారి ఐపీఎల్‌ నుంచి తప్పుకునే పరిస్థితులున్నాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే హర్భజన్‌సింగ్‌ చెన్నై జట్టుతో కలవాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆయన దుబాయ్‌కే చేరుకోలేదు. దీంతో అతను ఐపీఎల్ ఆడుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇటీవలే చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులోని పలువురు సభ్యులకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో హర్భజన్‌ సింగ్‌ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అందుకే ఈ టోర్నీ నుంచి దూరంగా వుంటే బెటరనుకుంటున్నాడు. 
 
కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేవని రైనా భారత్‌కు రావడంతో, భజ్జీ కూడా అనుమానులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్నిపరిస్థితులు బాగుంటే టోర్నీ మధ్యలో జాయిన్ అవుతాడని హర్బజన్ సింగ్ సన్నిహితులు తెలుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments