సంజూ శాంసన్ బ్యాటింగ్ స్టైల్‌కు ఫిదా అయిన స్టార్ బ్యాటర్ స్మృతి (video)

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (15:46 IST)
Smriti Mandhana
ఐపీఎల్‌లో కేరళ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. తొలుత చెన్నైపై మ్యాచ్‌లో 32 బంతుల్లో 74 పరుగులతో చెలరేగిన ఈ ఆటగాడు.. ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లలో ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఈ తర్వాత పంజాబ్‌పై 42 బంతుల్లో 85 (4 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. 
 
జట్టులో సీనియర్లు విఫలమైనా.. దూకుడైన ఆటతీరుతో రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లో కీలక ఆటగాడిగా మారాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన శాంసన్‌ ఆ తరువాత మరింత కసిగా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. వరుస మ్యాచ్‌ల్లో అతనాడిన షాట్స్‌కు మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
ఇక ఈ క్రమంలోనే కేరళ ఆటగాడి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సైతం పెరుగుతోంది. ఈ జాబితాలో మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన చేరిపోయింది. సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌కు తాను ఫిదా అయ్యాయని చెప్పింది. శాంసన్‌ కొట్టే బౌండరీలు తననెంతో కట్టిపడేశాయని పేర్కొంది. అతనికి ఫ్యాన్‌గా మారిపోయానని, శాంసన్‌​ కోసమే రాజస్థాన్ జట్టుకు సపోర్టు చేస్తున్నానని తెలిపింది. 
 
తన ఆటతీరుతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని, శాంసన్‌ బ్యాటింగ్‌ కోసమే రాజస్థాన్‌ మ్యాచ్‌ చూస్తున్నట్లు తెలిపింది. కాగా శనివారం మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కౌన్సిలర్

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

తర్వాతి కథనం
Show comments