Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : చెన్నై సింహాలు వర్సెస్ నైట్ రైడర్స్ (మ్యాచ్ ప్రివ్యూ)

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (16:07 IST)
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ పోటీల్లో భాగంగా బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై వచ్చిన విజయం అనంతరం మరో గెలుపు చూడటానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ హ్యాట్రిక్‌ ఓటములను చవిచూసింది. ఇక ఈ సీజన్‌లో సూపర్‌ కింగ్స్‌ కథ కంచికే అనుకుంటున్న తరుణంలో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా పదవి వికెట్ల భారీ తేడాతో ధోనీ సేన గెలుపొందింది. ఈ గెలుపుతో ఈ టోర్నీ టైటిల్ రేసులో తన ఆశలను సజీవంగా నిలుపుకుంది. పైగా, పంజాబ్‌ జట్టు నిర్ధేశించిన లక్ష్యాన్ని చెన్నై ఓపెనర్లే బాదేశారు. అంటే.. చెన్నై సింహాలు మంచి జోరుమీదున్నారు. 
 
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. కాగా కోల్‌కతాకు కెప్టెన్ దినేశ్ కార్తీక్ వైఫల్యం పెద్ద సమస్యగా తయారైంది.

కార్తీక్ ఇటు కెప్టెన్‌గా అటు బ్యాట్స్‌మన్‌గా ఘోరంగా విఫలమవుతున్నాడు. కోల్‌కతా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మిశ్రమ ఫలితాలను చవిచూసింది. ఈ క్రమంలో అబుదాబి వేదికగా ఇరు జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది.
 
మరోవైపు, కోల్‌కతా జట్టులో కెప్టెన్ దినేష్ కార్తీక్‌తో పాటు స్టార్ ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు కూడా ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కమిన్స్ కూడా తన స్థాయికి ప్రదర్శన చేయలేక పోతున్నాడు. ఇయాన్ మోర్గాన్, నితీష్ రానా, శుభ్‌మన్ గిల్‌లు మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. ఈసారైన మిగతావారు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
 
ఇక ఓపెనర్ షేన్ వాట్సన్ ఫామ్‌లోకి రావడం చెన్నైకి పెద్ద ఊరటనిచ్చే అంశం. డుప్లెసిస్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సమష్టి పోరాటంతో ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనే పట్టుదలతో చెన్నై కనిపిస్తోంది. ఈ మ్యాచ్ బుధవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభంకానుంది. 
 
కాగా, ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 22 సార్లు తలపడగా అందులో 14 సార్లు సీఎస్కే జట్టు, 8 సార్లు కోల్‌కతా జట్టు విజయం సాధించాయి. ముఖ్యంగా, 2012లో ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఐదు వికెట్ల తేడాతో సీఎస్కేను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. 
 
ఇరు జట్ల వివరాలు (అంచనా) 
చెన్నై సూపర్ కింగ్స్ ... షేన్ వాట్సన్, డు ప్లెసిస్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, రవీంద్ర జడేజా, బ్రావో, పియూష్ చావ్లా, దీపక్ చాహర్, జోష్ హాజల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్. 
 
కోల్‌కతా నైట్ రైడర్స్... సునీల్ నారాయణ్, శుభమన్ గిల్, టామ్ బాంటన్, దినేష్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి, అండ్రూ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణా, కమలేష్ నాగర్కోటి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments