IIT Madras అలా చెప్పిందని ధోనీ ఇలా చేశాడా? అదే దెబ్బ కొట్టిందా?

Webdunia
బుధవారం, 8 మే 2019 (17:26 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ గురించి ఐఐటీ మద్రాస్ ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్న-దానికి సమాధానం మరోసారి చర్చలోకి వచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్‌కి సంబంధించి ధోనీ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవాలా? బ్యాటింగ్ ఎంచుకోవాలా? అంటూ ప్రశ్న అడిగారు. దీనికి వివరణ కూడా ఇచ్చారు. పిచ్ పరిస్థితులను తెలిపారు. రాత్రిపూట పిచ్ పైన తేమ అధికంగా వుంటుంది కనుక ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా, ఫీల్డింగ్ బెటరా అని అడిగారు. దానికి విద్యార్థుల నుంచి రకరకాల సమాధానాలు వచ్చాయి. 
 
ఐతే సమాధానం మాత్రం టాస్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ పీల్డింగ్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే, రాత్రివేళ గాలిలో తేమ అధికంగా వుంటుంది కనుక బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వుంటుంది. వాళ్లు అనుకున్నట్లుగా బంతులు పడకపోవచ్చు. ఫలితంగా జట్టు విజయావకాశాలు తక్కువ. ఇదీ సమాధానం.
 
కానీ నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానితో వెంటవెంటనే వికెట్లు పడిపోవడం, ఆ తర్వాత స్వల్పస్కోరు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో లక్ష్య చేధన ఒత్తిడి తీసుకువస్తుందన్న కారణంగా ధోనీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 
 
కానీ ఐఐటి మద్రాస్ అంచనా వేసినట్లుగానే తదుపరి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ కు చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... చెన్నై చెపాక్ స్టేడియంలో ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రతిసారీ విజయం సాధించారు. మరి... నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకుని అపజయం పాలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నల్గొండ జిల్లాలో దారుణం : మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించారు..

13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదు- చైనా మాజీ మేయర్ జాంగ్ జీకి ఉరిశిక్ష (video)

KCR Plea Dismissed: ఫామ్‌హౌస్‌కు రాలేం.. కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన సిట్

హైదరాబాద్‌లో విషాద ఘటన - రైలు కిందపడి ముగ్గురు కుటుంబ సభ్యులు సూసైడ్

Tirumala Laddu: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌పై సిట్ యాక్షన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితోవ్ తేజపై కేసు

అమరావతికి ఆహ్వానం లాంటి చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ప్రాణం : మురళీ మోహన్

తర్వాతి కథనం
Show comments