Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలుపును తన్నిన అంపైర్.. రూ.5వేలు ఇచ్చాడు.. అవసరమా?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (12:14 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్లపై జరిమానాలు మామూలైపోయాయి. మొన్నటికి మొన్న ధోనీ, నిన్నటికి నిన్న కోహ్లీలు మైదానంలో వాగ్వివాదానికి దిగిన వారే. తాజాగా ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ-అంపైర్ నిగెల్ లాంగ్ మధ్య గొడవ జరిగింది. 
 
బెంగళూరు బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన 20వ ఓవర్‌లో ఓ బంతిని అంపైర్ నిగెల్ నోబాల్‌గా ప్రకటించాడు. కానీ టీవీ రీప్లేలో అది నోబాల్ కాదని తేలింది. అంతే అంపైర్ నిర్ణయంపై కోహ్లీ, ఉమేశ్ అసంతృప్తికి దిగారు. ఇంకా వాగ్వివాదానికి దిగారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా నిగెల్ వెళ్లి బంతి వేయాల్సిందిగా యాదవ్‌కు సూచించాడు. అంతేగాకుండా  సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం అంపైర్ రూములోకి వెళ్లాడు. 
 
అక్కడ కోపంతో గది తలుపును తన్నడంతో.. అది కాస్త ధ్వంసమైంది. అంపైర్ తీరును తీవ్రంగా పరిగణించిన కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) దీనిని క్రికెట్ పాలక మండలి (సీఓఏ) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాగా, ధ్వంసమైన తలుపు మరమ్మతుల కోసం అంపైర్ నిగెల్ రూ.5 వేలు చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments