Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహోరే.. బాహుబలి కాదు సాహోరే.. పంజాబ్‌: బంతికీ బ్యాట్‌కి మధ్య పోటీలో బంతి విన్నర్

ప్రీతీ జింటా యాజమాన్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అద్భుతమే సృష్టించింది. పొలార్డ్ వంటి భీకర బ్యాట్స్‌మన్‌నే చివరి ఓవర్లో ముప్పుతిప్పలు పెట్టించి పరుగులు రాకుండా అడ్డుకుని ముంబై ఇండియన్స్ వైపు పో

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (02:06 IST)
ప్రీతీ జింటా యాజమాన్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అద్భుతమే సృష్టించింది. పొలార్డ్ వంటి భీకర బ్యాట్స్‌మన్‌నే చివరి ఓవర్లో ముప్పుతిప్పలు పెట్టించి పరుగులు రాకుండా అడ్డుకుని ముంబై ఇండియన్స్ వైపు పోతున్న గెలుపును అమాంతంగా లాగేసుకుంది. 231 పరుగుల లక్ష్యం..  ఆసాధ్యమే అయినప్పటికీ చివరి వరకూ పోరాడిన  ముంబై ఇండియన్స్ జట్టు చివరి నాలుగు బంతులలో  చేతులెత్తేసింది. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్‌ ఓ భారీ సిక్స్‌ బాదినా మోహిత్‌ అద్భుతంగా బంతులేసి తమ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 7 పరుగుల తేడాతో నెగ్గి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. 
 
అంతకుముందు వృద్ధిమాన్‌ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్‌లో తొలిసారి తమ కీలక మ్యాచ్‌లో చెలరేగడంతో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్టిల్‌ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడారు. ఆ తర్వాత 231 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడింది. సిమన్స్‌ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పార్థివ్‌ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు), పొలార్డ్‌ (24 బంతుల్లో 50 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ సాహాకు దక్కింది.
 
లక్ష్యం భారీగా ఉండటంతో ప్రారంభంలో ముంబై ఇన్నింగ్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. ఓపెనర్లు పార్థివ్, సిమన్స్‌ ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. రెండో ఓవర్‌లో పార్థివ్‌ మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్‌లో సిమన్స్‌ రెండు సిక్సర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్‌లోనే సిమన్స్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్‌ నుంచి ముంబై పతనం ప్రారంభమైంది. మోహిత్‌ శర్మ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగిన పార్థివ్‌ నాలుగో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
 
ఇక పదో ఓవర్‌లో సిమన్స్‌ లాంగ్‌ ఆన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌ దగ్గర గప్టిల్‌ అమాంతం పైకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌ తీసుకోవడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ (5), నితీశ్‌ రాణా (12) వరుసగా అవుట్‌ కావడంతో 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చారు. హెన్రీ వేసిన 16వ ఓవర్‌లో వీరిద్దరు రెండేసి సిక్సర్లు బాదడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. కానీ మరుసటి ఓవర్‌లో సందీప్‌.. పాండ్యా వికెట్‌ తీయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా కరణ్‌ శర్మ ఆడిన ఆరు బంతుల్లోనే మూడు ఫోర్లు, ఓ సిక్స్‌ బాది 19 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన దశలో ముంబై తడబడి విజయానికి దూరమైంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments