Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫీవర్: ఎనిమిది జట్ల బలం-బలహీనత ఏంటో తెలుసుకుందాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌‍ పదో సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. మే 21వ తేదీ వరకు జరిగే.. ఈ సిరీస్‌లో 8 జట్లు బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జ

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌‍ పదో సీజన్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. మే 21వ తేదీ వరకు జరిగే.. ఈ సిరీస్‌లో 8 జట్లు బరిలోకి దిగనున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గౌతం గంభీర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు టైటిల్ కోసం పాకులాడుతోంది. మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు.. రెడీ అవుతోంది. ఈ జట్టులో బ్రావో, యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే, సూర్య కుమార్ యాదవ్, సునీల్ నరేన్, కుల్‌దీప్ వంటి మేటి క్రికెటర్లున్నారు. 
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
తాత్కాలిక కెప్టెన్ వాట్సన్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ ఓ ఛాలెంజ్ కానుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాహుల్, డివిలియర్స్ ఈ టోర్నీ నుంచి గాయాల పాలై.. ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇదే జట్టుకు మైనస్. 
 
గుజరాత్ లయన్స్: 
సురేష్ రైనా నాయకత్వంలోని గుజరాత్ లయన్స్ గత ఐపీఎల్ పోటీల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. ఈ జట్టులో మెక్ కల్లమ్, అరోన్ పిచ్, దినేష్ కార్తీక్, జోసెఫ్ రాయ్ వంటి కుమ్మేసే బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. అయితే ఆల్ రౌండర్లు జడేజా, బ్రావో రెండు వారాల పాటు ఆటకు దూరం కావడం ఈ జట్టుకు మైనస్. 
 
సన్ రైజర్స్ హైదరాబాద్ :
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని ఈ ఏడాది కూడా కైవసం చేసుకునేందుకు మల్లగుల్లాలు పడుతోంది. కెప్టెన్ వార్నర్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, దీపక్ షీడా, రషీద్ ఖాన్, ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ మొహ్మద్, ప్రవీణ్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లు ఈ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. కానీ నెహ్రా గాయాల నుంచి కోలుకుని జట్టుకు చేరుకునేంత వరకు జట్టుకు కాస్త కష్టాలు తప్పవు. 
 
ముంబై ఇండియన్స్:  
రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు రెడీ అవుతోంది. రోహిత్ శర్మ, జోస్ బట్లర్, పోలార్డ్, హార్దిక్ పాండ్య, సిమ్మన్స్, అంబటి రాయుడు వంటి అత్యుత్తమ క్రీడాకారులు ఈ జట్టులో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో హర్భజన్ సింగ్, బుమ్రాలు జట్టుకు ప్లస్‌గా నిలుస్తారు. 
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ : 
మాక్స్‌వెల్ నేతృత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వృద్ధిమాన్ సాహా, మిల్లర్ వంటి ధీటుగా ఆడే క్రికెటర్లతో బరిలోకి దిగుతోంది. కానీ మురళీ విజయ్ గాయంతో మ్యాచ్‌లకు దూరం కావడం జట్టుకు మైనస్. 
 
ఢిల్లీ డేర్‌డెవిల్స్ : 
జహీర్ ఖాన్ నేతృత్వంలోని ఈ జట్టు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. డుమిని, డికాక్ గాయాలతో తప్పుకున్నా.. అమిత్ మిశ్రా, ఆండర్సన్, కరుణ్ నాయర్, మాథ్యూస్ వంటి ఆటగాళ్లు ఈ జట్టుకు బలంగా ఉన్నారు. అయితే ఇప్పటికే జరిగిన తొమ్మిది ఐపీఎల్ సీజన్లలో ఆడిన ఢిల్లీ ఫైనల్‌కు చేరుకోలేదు. 
 
రైజింగ్ పూణే సూపర్ జెయింట్ : 
కెప్టెన్ పోస్టు నుంచి ధోనీని తప్పించి.. ఆ స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్‌ను ఎంపిక చేశారు. రూ.14.5 కోట్ల మొత్తంతో వేలంలో కొనుగోలు చేసిన బెన్ స్టోకస్‌పై భారీ అంచనాలున్నాయి. రహానే డుప్లెసిస్ వంటి ఆటగాళ్లతో తప్పకుండా ఈ జట్టు తప్పకుండా మెరుగ్గా ఆడుతుందని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు. తొలి మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా నేను అని పోటీ పడనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments