Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2017 : మ్యాక్స్‌వెల్‌ మెరుపులు.. పుణెపై పంజాబ్‌ అద్భుత విజయం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-10 పోటీల్లో భాగంగా, శనివారం రాత్రి ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ జట్టు శుభారంభం చేసింది. తన పత్యర్థి రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌పై ఆరు వ

Webdunia
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-10 పోటీల్లో భాగంగా, శనివారం రాత్రి ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ జట్టు శుభారంభం చేసింది. తన పత్యర్థి  రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పూణె జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత బెన్‌ స్టోక్స్‌ (50) అర్థ సెంచరీతో పాటు మనోజ్‌ తివారి (40 నాటౌట్‌) రాణించారు. ప్రత్యర్థి జట్టు బౌలర్ సందీప్‌ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. 
 
అనంతరం కెప్టెన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 నాటౌట్‌), డేవిడ్‌ మిల్లర్‌ (27 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పంజాబ్‌ 6 వికెట్లతో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌పై విజయం సాధించింది. వీరిద్దరు మ్యాక్స్‌-మిల్లర్‌ ఐదో వికెట్‌కు 79 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా పంజాబ్‌ 4 వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 
 
ఒక దశలో పంజాబ్‌ 85/4తో కష్టాల్లో పడగా.. కెప్టెన్‌ మాక్స్‌వెల్‌-డేవిడ్‌ మిల్లర్‌ ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. పంజాబ్‌ విజయానికి చివరి 48 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉండగా.. మ్యాక్స్‌వెల్‌ భారీ షాట్లతో విరుచుకుపడటంతో లక్ష్యం చిన్నదైపోయి అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మాక్స్‌వెల్ అందుకున్నాడు. 
 
సంక్షిప్త స్కోర్లు : పుణె: 20 ఓవర్లలో 163/6 (బెన్‌ స్టోక్స్‌ 50; మనోజ్‌ తివారి 40 నాటౌట్‌; సందీప్‌ 2/33) పంజాబ్‌: 19 ఓవర్లలో 164/4 (మ్యాక్స్‌వెల్‌ 44 నాటౌట్‌, డేవిడ్‌ మిల్లర్‌ 30 నాటౌట్‌; తాహిర్‌ 2/29).

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments