శ్రీవల్లి కథ అలా పుట్టింది.. జక్కన్న మహాభారతం తీసే ఛాన్సుంది: విజయేంద్ర ప్రసాద్

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం శ్రీవల్లి అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. అంతేకాదు... ఆ చిత్రానికి

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (14:16 IST)
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన రచయిత, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం శ్రీవల్లి అనే సినిమాకు స్క్రిప్ట్ రాశారు. అంతేకాదు... ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ సినిమాపై విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఆలోచనలకు.. మానసిక విశ్లేషణకు అనుగుణంగా ఈ కథ వుంటుందని చెప్పారు. వైజాగ్‌లో తనకు రమేష్ అనే మిత్రుడుండే వాడని.. అతడు 2010లో వినాయక చతుర్థి  ముందు రోజే చనిపోయాడని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. 
 
తనకోసం ఎంతో కాలం వేచి చూసిన ఆయన.. చివరి క్షణాల్లో తనను తలచుకున్నాడని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తన మిత్రుడిని చూడాలనుకున్నా.. వైజాగ్‌కు ఆతడు చనిపోయిన రెండేళ్లకు తర్వాత వెళ్లి.. షాక్ అయ్యానన్నారు. 2010లో వినాయక చవితి ముందురోజు ఆ మిత్రుడిని చూడాలని తనకి ఎంతగానో అనిపించిందని అన్నారు. మనసు రమేష్ వైపే లాగిందని, అయితే అప్పుడు వెళ్లలేకపోయిన తాను, ఆ తరువాత రెండేళ్లకు వైజాగ్‌లోని అతనింటికి వెళ్తే.. అంతలో అతడు కన్నుమూశాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ బాధలో నుంచి శ్రీవల్లి కథ పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
 
ఇక బాహుబలి దర్శకుడు, తనయుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా భావించే మహాభారతం గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజమౌళి 'మహాభారతం' తీస్తాడని తాను ఇంతకుముందు తానెక్కడా చెప్పలేదన్నారు. కానీ ప్రస్తుతానికి చెప్పేదేమిటంటే.. జక్కన్న తప్పకుండా మహాభారతం తీసే అవకాశం ఉందని తెలిపారు. రాజమౌళికి యుద్ధాలు అంటే ఎంతో ఇష్టమనీ, వాటికోసమైనా ఆయన 'మహాభారతం' తెరకెక్కించవచ్చునని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

దయచేసి నన్ను విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే వుండండి, ఆపొద్దు: తమిళనాడు సీఎం విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments