మీ ఇద్దరినీ పెట్టి తప్పు చేశానేమోనని త్రివిక్రమ్ అన్నారు... సమంత ఇంటర్వ్యూ

ఎందరో సీనియర్స్‌ మధ్య నటించిన సమంత, నితిన్‌ పక్కన నటించేందుకు మూడురోజుల పాటు చాలా కష్టపడింది. ఈ విషయమై ఆమె చెబుతూ.. 'అ..ఆ'. సినిమా షూటింగ్‌లో మూడు రోజుల వరకు నితిన్‌కూ నాకూ కెమిస్ట్రీ కుదరలేదు. దాంతో అనుకున్న షాట్స్‌ సరిగ్గా రాలేదు. మీ ఇద్దరిని పెట్ట

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:44 IST)
ఎందరో సీనియర్స్‌ మధ్య నటించిన సమంత, నితిన్‌ పక్కన నటించేందుకు మూడురోజుల పాటు చాలా కష్టపడింది. ఈ విషయమై ఆమె చెబుతూ.. 'అ..ఆ'. సినిమా షూటింగ్‌లో మూడు రోజుల వరకు నితిన్‌కూ నాకూ కెమిస్ట్రీ కుదరలేదు. దాంతో అనుకున్న షాట్స్‌ సరిగ్గా రాలేదు. మీ ఇద్దరిని పెట్టి తప్పు చేశానేమోనని త్రివిక్రమ్‌ అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమాల్లో జీవించామని... నటి సమంత తెలియజేస్తుంది.
 
త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంతల కాంబినేషన్‌లో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రూపొందించిన చిత్రం 'అ ఆ' అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి అన్నది ఉప శీర్షిక. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. మంగళవారం నాడు పబ్లిసిటీలో భాగంగా సమంతతో ఇంటర్వ్యూ.
 
ఈ సమ్మర్‌ ఎలా వుంది?
ఈ సమ్మర్‌లో 'అ ఆ' నా చివరి సినిమా. ఇది నా కెరీర్‌కు చాలా ముఖ్యమైనది. వరుసగా మూడు సినిమాలు నా చిత్రాలు విడుదలయ్యాయి. తమిళంలో కూడా ఓ సినిమా చేశాను.
 
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది?
నేను ఇప్పటివరకు సీరియస్‌, రొమాన్స్‌ వంటి జోనర్స్‌ సినిమాల్లో నటించాను. కానీ కామెడీ మాత్రం ట్రై చేయలేదు. మొదటిసారి కామెడీ పాత్రలో నటిస్తున్నాను. నాకు మొదటి నుండి కమెడియన్స్‌ అంటే చాలా గౌరవం. కామెడీ అనేది చాలా కష్టమైన జోనర్‌. నన్ను నమ్మి ఇలాంటి రోల్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ గారికి థాంక్స్‌. నేను నా పాత్రకు జస్టిస్‌ చేశాననే అనుకుంటున్నాను.
 
'బ్రహ్మోత్సవం' నిరాశపర్చిందా?
కథ వినేటప్పుడు నటించేటప్పుడు తేడా తెలీదు.. సినిమా బయటకు వచ్చాక.. ప్రేక్షకుల తీర్పే ఫైనల్‌.. వారికి నచ్చలేదు.. నాతోపాటు అందరికీ నిరాశే..
 
త్రివిక్రమ్‌తో సినిమా ఎలా అనిపించింది?
త్రివిక్రమ్‌ గారిలో సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఈ సినిమాలో నేను ఎక్కువ ఆయన్నే ఇమిటేట్‌ చేశాను. 'అ ఆ' ఓ కొత్త కాన్సెప్ట్‌ అని నేను చెప్పను గానీ.. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి ఒక్కరి మొహం మీద నవ్వు మాత్రం ఉంటుందని చెప్పగలను. నేను ఈ సినిమా ఫస్ట్‌ కాపీ చూసిన తరువాత మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలనిపించింది.
 
మీరు ఏ ప్రాతిపదికన సినిమా సెలక్ట్‌ చేసుకుంటారు?
త్రివిక్రమ్‌ గారి సినిమా అని నేను ఒప్పుకోలేదు. మొదటి నుండి నన్ను గమనించి ఉంటే నేను స్క్రిప్ట్‌ నచ్చితేనే తప్ప ఎవరి గురించో సినిమా చేయను. మొదట స్క్రిప్ట్‌ విని నన్ను కన్విన్స్‌ చేసే విధంగా ఉంటే సినిమా చేస్తాను.
 
హీరోయిన్‌ పాత్రలపై మీ అభిప్రాయం?
హీరోయిన్స్‌కు తక్కువ ప్రాముఖ్యత ఉండే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. పది సినిమాల్లో ఒక సినిమాకు మాత్రమే హీరోయిన్‌కు మంచి క్యారెక్టర్‌ ఉంటుంది. ఇలాంటి నేపధ్యంలో నాకు 'అ ఆ' లాంటి మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ ఇద్దరికీ సమాన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రేమ కథను మాత్రమే కాకుండా కుటుంబంలోని బంధాలను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పూర్తిస్థాయి ప్రేమ కథను త్రివిక్రమ్‌ గారు ఇప్పటివరకు చేయలేదు.
 
రియల్‌ లైఫ్‌లో ఎలా వుంటారు?
ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. చాలా అల్లరి చేస్తూ.. తొందరగా డెసిషన్స్‌ తీసుకుంటూ ఉంటుంది. 
 
నితిన్‌తో నటించడం ఎలా అనిపించింది?
హీరో నితిన్‌తో నాకు మంచి స్నేహం ఉంది. ఈ సినిమాలో నటించేటప్పుడు కాస్త బెరుకుగా అనిపించింది. ఎందుకనోకానీ.. మొదలయిన మూడు రోజుల షూటింగ్‌లో మా ఇద్దరికి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ కాలేదు. త్రివిక్రమ్‌ గారు వీరిద్దరినీ సెలక్ట్‌ చేసుకొని తప్పు చేశాననుకున్నారు.
 
ఫ్లాప్స్‌ను ఎలా తీసుకుంటారు?
నేను హిట్స్‌, ఫ్లాప్స్‌ బాగా పట్టించుకుంటాను. హిట్‌ వచ్చినప్పుడు ఎంత సంతోషపడతానో.. ఫ్లాప్‌ వచ్చినప్పుడు అంతే బాధ పడతాను. అయినా.. రిజల్ట్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో ఉంటుంది. సమ్మర్‌లో రిలీజ్‌ అయిన నా సినిమాలు 'తేరి', '24' మంచి విజయాలను అందుకున్నాయి. 'బ్రహ్మోత్సవం' మాత్రం అనుకున్న రిజల్ట్‌ ఇవ్వలేకపోయింది.
 
మీ పెండ్లి గురించి వార్తలు విన్పిస్తున్నాయి?
ఈ విషయం ప్రత్యేకంగా అందరినీ పిలిచి చెబుతాను.
 
అప్పుడు ఇంకా మీపై వార్తలు వస్తూనే వుంటాయి గదా?
రోజూ.. నేను ఏ పేపర్‌ తీసినా.. నా గురించి ఏమి రాశారో అని టెన్షన్‌ పడుతుంటాను. మొదటిపేజీ సినిమా పేజీలో చూసి.. ఈరోజు రాయలేదు అనుకుంటాను.. కానీ చివరి పేజీలో రాస్తున్నారు కొంతమంది.. ఒక పేపర్‌లో.. నేను ఫలానా హీరోని పెండ్లి చేసుకుంటున్నట్లు.. నాలుగైదు పేర్లు రాశారు. ఇంతమంది.. హీరోలా! అనిపించింది. అందులో చాలామటుకు.. వారితో సినిమాలు చేసి చాలా రోజులయింది.. ఏది ఏమైనా.. పెండ్లి చేసుకుంటాను. అది ఎప్పుడు ఏమిటి? ఎవరితో అనేది.. త్వరలోనే తెలియజేస్తాను.
 
పెండ్లయ్యాక కూడా నటిస్తారా?
తప్పకుండా.. పెండ్లయినా నటిస్తాను.. 
 
తదుపరి చిత్రాలు
'యూ టర్న్‌' రీమేక్‌ సినిమాలో నటిస్తున్నాను. పవన్‌ అనే దర్శకుడు ఆ సినిమాకు పని చేస్తున్నాడు. తమిళ, తెలుగు భాషలలో సినిమా రిలీజ్‌ అవుతోంది. తెలుగులో 'జనతా గ్యారేజ్‌' సినిమాలో నటిస్తున్నాను. ఇప్పటివరకు తెలుగులో మరే సినిమాకు సైన్‌ చేయలేదు అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్యసభకు ఆర్ఆర్ఆర్.. జూన్ నాటికి ఆ నాలుగు స్థానాలు ఖాళీ

స్పేస్‌కు వీడ్కోలు చెప్పిన సునీత విలియమ్స్.. నాసాకు బైబై.. 62 గంటల 6 నిమిషాలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

రెండేళ్లలో 416మందితో డేటింగ్.. మహిళ షాకింగ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

తర్వాతి కథనం
Show comments