Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ నా లక్కీ నెం.9 అన్నారు కానీ నాకు నమ్మకం లేదు... రాంచరణ్ ఇంటర్వ్యూ

'మగధీర' తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్‌ చరణ్‌.. 'జంజీర్‌' రీమేక్‌లో పోలీసు పాత్రలో నటించాడు. మరలా అలాంటి పాత్రను తమిళ చిత్రం 'తను ఒరువన్‌' రీమేక్‌లో నటిస్తున్నాడు. రీమేక్‌ అయినా కథ చాలా కొత్తగా వుండటంతో మన ప్రేక్షకులకు చూపించాలనే ఈ ప్రయత

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (19:44 IST)
'మగధీర' తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న రామ్‌ చరణ్‌.. 'జంజీర్‌' రీమేక్‌లో పోలీసు పాత్రలో నటించాడు. మరలా అలాంటి పాత్రను తమిళ చిత్రం 'తను ఒరువన్‌' రీమేక్‌లో నటిస్తున్నాడు. రీమేక్‌ అయినా కథ చాలా కొత్తగా వుండటంతో మన ప్రేక్షకులకు చూపించాలనే ఈ ప్రయత్నం చేశానని చెబుతున్నాడు. ఈ నెల 9న విడుదలవుతున్న ఈ చిత్రం గురించి ఆయనతో చిట్‌చాట్‌.
 
విడుదల ముందు.. టెన్షనా.. కాన్ఫిడెన్సా?
ప్రతి సినిమాకూ వున్నట్లే వుండాల్సిన టెన్షన్‌ వుంది. అలాగే విజయంపై గట్టి నమ్మకమూ వుంది. రీమేక్‌ కాబట్టి ఇంకా ఎక్కువ టెన్షన్‌ వుంటుంది. ఎందుకంటే అప్పటికే అక్కడ విజయవంతమైన సినిమా కాబట్టి దానికంటే బాగుండాలనీ వుంటుంది.
 
రీమేక్‌ ఎంచుకోవడానికి కారణం?
అదికూడా కథే గదా.. నాకు అలాంటి పట్టింపులు లేవు. పక్కోడు హిట్‌ కొట్టాడు. దాన్ని మనం తీసుకోవడమేమిటనే ఇగో లేదు. ప్రేక్షకులకు చూపించాలనే తపన మాత్రమే వుంది.
 
ఈ సినిమానే చేయాలని ఎలా అనిపించింది?
డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాత ఎన్‌విఎస్‌ ప్రసాద్‌గారు కథ గురించి చెప్పారు. రీమేక్‌ చేయాలన్నారు. ఆయనకు నాపై నమ్మకం వుంటే.. నాకు ఎందుకు వుండకూడదనిపించింది.
 
వందమందిలో ఒకరిగానే అనే డైలాగ్‌ వుంది?
టాంక్‌బండ్‌ మీద విగ్రహంలా కాకుండా.. ప్రతిసారీ మారుతుంటాం. ముందు సినిమాల ప్రభావం తర్వాత సినిమాలపై వుంటుంది. కథలు మారుతుంటాయి. 
 
అరవింద్‌ స్వామితో చేయడం ఎలా అనిపించింది?
కొంచెం టెన్షన్‌గా వుండేది. సీనియర్‌ నటుడు. అదే సినిమాను హిట్‌ కొట్టి వస్తున్నాడు. అలవాటైన పాత్ర.. ఆయన వున్న విధానం.. కొత్త వ్యక్తిలా బిహేవ్‌ చేయడం.. నాకు చాలా ఇబ్బందైపోయింది. సీన్‌లు చేయడానికి ఇబ్బందైంది. తర్వాత తర్వాత అలవాటైంది.
 
మై ఎనిమీ ఈజ్‌ మై స్ట్రెంథ్‌... అనడానికి కారణం?
తెలుగులో అరవింద్‌స్వామి మినహా మాకు ఎవరూ కన్పించలేదు. అప్పటికే ఆయన నిరూపించుకున్నారు. కథలో ఎనిమిగా బాగా చేశారు. ఆయనకు పోటీగా చేసినట్లుంది. అందులోనూ తెలుగు ప్రేక్షకులు ఆయన్ను చూసి చాలా రోజులయింది.
 
మీ సర్కిల్‌లో చరణ్‌ ఇలాంటి సినిమాలు చేయడం మంచిదంటున్నారా?
నేను చేసింది సమ్‌థింగ్‌ కరెక్ట్‌.. క్యారెక్టర్‌ బాగా నచ్చింది. మనకు తెలిసిన విధానం అయినా భిన్నంగా వుంది. అలా ఎందుకు ఆలోచించకూడదు అనిపించింది. తమిళలో హిట్‌ అయిన కథ.. ఒక వ్యక్తి నాపై నమ్మకంతో.. చేయండి.. అని వచ్చాడు.. ఆయనకే నమ్మకం వుంటే.. నాకెందుకు వుండకూదనిపించింది. ఎన్‌విఎస్‌ ప్రసాద్‌.. మాస్‌ సీడెడ్‌ డిస్ట్రిబ్యూటర్‌. నాపై ఇలాంటి కథ చూడాలనుకుంటున్నారు.
 
మీరు చాలా సీరియస్‌ పాత్ర చేశారు. హోంవర్క్‌ చేశారా?
నేను అలా బేరీజు వేసుకోను. పాత్ర బట్టే చేస్తుంటాను. 
 
ఫిజిక్‌పై కష్టపడ్డారు?
ఎప్పుడో చేయాల్సింది. ఈ సినిమాకు కుదిరింది. ఫిజికల్‌గా అన్ని సినిమాలకు కష్టపడినట్లే ఈ సినిమాకూ కష్టపడ్డాం. 
 
మీ ఏక్టింగ్‌.. మారిందా?
కథే కొత్తగా వుంటుంది. అందుకే అన్ని కొత్తగా వుంటాయి. లుక్‌, టీజర్‌ అలా అనిపిస్తాయి.
 
ఒరిజినల్‌కు ఏమైనా మార్పులు చేశారా?
పెద్ద మార్పులు చేయలేదు. ఒరిజినల్‌కు దగ్గరగా వుంటుంది.
 
ఓవర్‌సీస్‌లో 2మిలియన్‌ టచ్‌ చేసిందదన్నారు?
మంచిదేకదా..
 
అక్కడ ప్రీమియర్‌ ప్లాన్‌ చేశారే?
అక్కడ చేయాల్సిన ఆడియో ఫంక్షన్‌ కేన్సిల్‌ చేశాం. అందుకే ప్రీమియర్‌ ఇక్కడ బదులు అక్కడ వేస్తున్నాం. 
 
సిద్దార్థ్‌, అభిమన్యు పాత్రల్లో మార్పులున్నాయా?
ఆ పాత్రల్లో వేరియేషన్‌ కామన్‌గా వున్నా... ఫైనల్‌ ప్రొడక్ట్‌లో చాలా మార్పులు జరిగాయి. దర్శకుడు సురేందర్‌ రెడ్డి మనవారికోసం కొంచెం మార్చారు. అయితే అరవింద్‌స్వామి పాత్రను తక్కువచేయలేదు.
 
కిడ్స్‌ను ఫాలో అవుతున్నారని అన్నారు?
అవును. ఏ కథ అయినా మా ఇంట్లో పిల్లలికే నచ్చకపోతే నేనేం చేయగలను. కథ వినేటప్పుడు అవన్నీ గ్రహిస్తాను.
 
బ్రూస్‌లీ తర్వాత ఏం నేర్చుకున్నారు?
ప్రతి సినిమాకూ నేర్చుకుంటాం.. కథలు ఎంచుకునే విధానం కొంచెం మారినట్లుంది. 
 
మీ కెరీర్‌‌గ్రాఫ్‌ పెరిగిందనుకుంటున్నారా?
అన్ని ప్లాన్‌ చేయలేం.
 
'జంజీర్‌' తర్వాత మళ్ళీ రీమేక్‌ చేశారు?
పోలీసు పాత్ర అని ఆలోచించలేదు. కేవలం కథలోని క్యారెక్టర్‌ చాలా బాగుందనే చూశాం. అయితే ఇంత త్వరగా పోలీసు పాత్ర వస్తుందని అనుకోలేదు. పోలీసు పాత్ర చేయడానికి కారణం కథలోని బలమే.
 
రకుల్‌ను వెంటనే తీసుకున్నారు?
కొత్తవారు ఇంకా ఎవరున్నారు చెప్పండి? ఆ అమ్మాయి నటిగా ఇన్‌వాల్వ్‌ అయి చేస్తుంది. 'నాన్నకు ప్రేమతో' ప్రూవ్ చేసుకుంది. కొత్తవారు వస్తే వారినే పెట్టుకునేవాళ్లం. అయినా లక్కీగా నాకు మళ్ళీ ఆమెనే కుదిరింది.
 
కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఛాన్స్‌ మీదేనా?
25 ఏళ్ల కుర్రాడు మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇంతకుముందు కీ-బోర్డు ప్లే చేశాడు. సౌండింగ్‌ కొత్తగా ఇచ్చాడు. ట్రైలర్‌లోనే అది తెలుస్తుంది. 
 
దర్శకుడు ఛాయిస్‌ మీదేనా?
నేను, సురేందర్‌ ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నాం. కానీ ఈ సినిమాను నేనే ఫోర్స్‌ చేసి చేయమన్నా. ఆయన స్వంత కథను అనుకున్నారు. ఎలాగైనా రీమేక్‌ కథను చేయడం కష్టమే. దాన్ని పాడు చేయకుండా చేశాడు.
 
సిక్స్‌ప్యాక్‌ ఈ సినిమాకే చేయడానికి?
కథ డిమాండ్‌ చేసింది.
 
ఉపాసన.. హెల్త్‌ టిప్స్‌ ఇచ్చిందని తెలిసింది?
అటువంటిది లేదు. చక్కటి శిక్షకులు, డైటీషియన్స్‌ వున్నారు. వారి ప్రకారం నడుచుకున్నాను.
 
ఇది ఎలాంటి సినిమా?
పూర్తి ఎంటర్‌టైనర్. కథ పరంగానే సాగుతుంది. 'మగధీర చూసినా'.. అందులో పెద్దగా కథ వుండదు. ఎమోషనల్‌ రన్‌ అవుతుంది. 'సరైనోడు'లో కథ కంటే కామెడీ వుంటుంది. అదే జనాలను కూర్చోపెడుతుంది.
 
అన్ని సీరియస్‌ పాత్రలే చేస్తున్నారే?
దర్శకుడు సుకుమార్‌తో చేసేది.. పూర్తి విరుద్ధంగా వుంటుంది. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నాన్నగారి సినిమా రిలీజ్‌ అయ్యాక ఆ సినిమా చేస్తా.
 
నిర్మాతగా ఎలా వున్నారు?
వినయ్‌గారుంటే చాలు. అన్నీ ఆయనే చేసుకుంటూపోతాడు. ఆయనలో నిర్మాత, దర్శకుడు వున్నాడు. టాకీ అయిపోయింది. రేపు పాట చివరి రోజు. ఆడియో ఎక్కడనేది ఫిక్స్‌ చేయలేదు. క్రిస్‌మస్‌ ముందు రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌ చేస్తున్నాం. సినిమాను జనవరి 11, లేదా 12న విడుదల చేయాలనుకుంటున్నాం. 
 
మణిరత్నం కథ రెడీ చేస్తున్నారని చెప్పారు?
అవును.. ఇంకా చర్చలు జరుగుతున్నాయి.
 
డిసెంబర్‌ 2 నుంచి వాయిదా వేయడానికి కారణం?
నోట్ల ఇబ్బందే.
 
అది ఇంకా సెటిల్‌ అయిందనుకుంటున్నారా?
పూర్తిగా కాలేదు. ఇంకా ఐదారు నెలలు పట్టవచ్చు. అయినా కాస్త సెటిల్‌ అయిందనిపించింది. ఏదైనా నోట్ల సమస్య తర్వాత వచ్చే మొదటి సినిమా మాదే అవుతుంది.
 
మీరెలా నోట్లను వుపయోగిస్తున్నారు?
కార్డులు అలవాటు చేసుకుంటున్నాం. ఎక్కువ డ్రా చేయకుండా జాగ్రత్తపడుతున్నాం. బయటకు వెళ్ళాంటే 200 రూపాయలు తీసుకెళ్ళాల్సివస్తుంది. ఇదివరకయితే విచ్చలవిడిగా డబ్బును తీసుకెళ్లేవాళ్ళం. ఏదైనా మంచికే జరిగింది.
 
పొగడ్తలు ఎలా స్వీకరిస్తారు?
చాలా ఇబ్బందిగా వుంటాయి. కానీ వారి గౌరవాన్ని స్వీకరించాలి.
 
మీది రీమేక్‌.. ఫాదర్‌ సినిమా రీమేక్‌. పవన్‌ రీమేక్‌?
(నవ్వుతూ) అవును. అందరూ రీమేక్‌ చేస్తున్నాం. అయితే చేసే సినిమాలే రీమేక్‌లు.. మాకు పట్టింపులు లేవు. కథ బాగుందని చేయడమే. మనం కూడా చూడాలనే ఫీలింగ్‌ అలా చేయిస్తుంది.
 
ఇతర భాషల్లో మీ ప్లాన్స్‌ వున్నాయా?
ప్రస్తుతానికి తెలుగు సినిమానే. ఇతర భాషల్లో చేయాలనే ఐడియా లేదు. హిందీ కూడా ఏమనుకోవడంలేదు.
 
150 సినిమాలో నటించారా?
పాటలో జస్ట్ అలా కన్పిస్తాను. నిన్ననే చిత్రీకరించారు.
 
హార్రర్‌ మూవీస్‌ సక్సెస్‌ అవుతన్నాయి. మీకేమైనా ప్లాన్‌ వుందా?
ఇంట్రెస్ట్‌ అయిన కథ దొరకలేదు. 
 
సెంటిమెంట్‌ను నమ్ముతారా?
నమ్మను. నా లక్కీ నెంబర్‌ 9 అని కెటిఆర్‌.. అన్నారు. ఆయనకు అలా అనిపించిందేమో.
 
కళ్యాణ్‌గారి బేనర్‌లో?
వచ్చే ఏడాది చేస్తా.
 
సినిమా నిడివి ఎక్కువగా వుందనిపించలేదా?
కంటెంట్‌ బాగుంది. రన్‌ ఇంట్రెస్ట్‌గా వుంటుంది. దాంతో ఎక్కడా ఎక్కువ అనిపించదు. తమిళ వెర్షన్‌ ఎక్కడా ఎడిట్‌ చేయలేదు. అప్పటికే వారు క్లీన్‌గా స్క్రీన్‌ప్లే చేశారు. దాన్ని పాడుచేయలేదు. అన్ని సీన్లు ఒకదానికొకటి లింక్‌ వుంటుంది.
 
సినిమాను మీ నాన్నగారు చూశారా?
ఇంకా చూడలేదు.. ఎల్లుండి చేస్తారు.
 
ఫ్యాన్స్‌ కోసం బెనిఫిట్‌ షోలు ఐడియా లేదా?
ఇంకా లేదు. ఉంటే.. అరవింద్‌గారే చూసుకుంటారు అని చెప్పారు.
 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments