హైదరాబాద్‌లో నా బిజినెస్‌ బాగుంది... తప్పు చేస్తే కొడతారు... రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంటర్వ్యూ

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' నుంచి పండుగ చేస్కో.. వరకు డీ గ్లామర్‌గానే కన్పిస్తాను. ఆ తర్వాత వచ్చిన 'బ్రూస్‌లీ', 'నాన్నకు ప్రేమతో' చిత్రాల్లో గ్లామర్‌గా కన్పించాను. నాకు ఏదైనా పాత్ర చెప్పినప్పుడులో అందులో దాని ప్రాధాన్యత గమనిస్తాను కానీ.. మేకప్‌ గురించ

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (22:30 IST)
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' నుంచి పండుగ చేస్కో.. వరకు డీ గ్లామర్‌గానే కన్పిస్తాను. ఆ తర్వాత వచ్చిన 'బ్రూస్‌లీ', 'నాన్నకు ప్రేమతో' చిత్రాల్లో గ్లామర్‌గా కన్పించాను. నాకు ఏదైనా పాత్ర చెప్పినప్పుడులో అందులో దాని ప్రాధాన్యత గమనిస్తాను కానీ.. మేకప్‌ గురించి పెద్దగా పట్టించుకోనని'' నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెబుతోంది. తాజాగా ఆమె అల్లు అర్జున్‌తో 'సరైనోడు' చిత్రంలో నటించింది. ఇందులోని పాత్ర గురించి, ఇతర విషయాల గురించి ఆమె ఇలా తెలియజేస్తుంది.
 
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
దర్శకుడు బోయపాటి శ్రీను ముందుగానే ఆ పాత్ర గురించి వివరాలన్నీ చెప్పారు. దర్శకుడు చెప్పింది చేశానంతే. రాజమండ్రికి చెందిన మహాలక్ష్మి అనే పాత్రలో మేకప్‌ లేకుండా కన్పిస్తాను. నేను పలికే డైలాగ్‌లో యాస కూడా వుంటుంది. అది చెప్పేటప్పుడు చాలా థ్రిల్‌గా ఫీలయ్యాను. మొదట డబ్బింగ్‌ చెబుదామని అనుకున్నా.. యాసలో వున్న అందం పోతుందని నేను చెప్పలేదు.
 
అల్లు అర్జున్‌ డాన్స్‌ స్పీడ్‌ను మీరందుకున్నారా?
ఆయన డాన్స్‌ చేసినతీరు చూసి.. చాలా కష్టమనిపించింది. అందుకే ముందుగానే డాన్స్‌ కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆ తర్వాత అల్లు అర్జున్‌తో చేయగలిగా.
 
తెలుగులో మీ కెరీర్‌ ఎలా వుంది?
ప్రేక్షకులు, దర్శక నిర్మాతల సహకారంతో ముందుకు సాగుతున్నాయి. నా పాత్రను ప్రేక్షకులు ఇష్టపడ్డారు కాబట్టే ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నాను.
 
బోయపాటి చిత్రాల్లో కథానాయికకు ప్రాధాన్యత ఎంత మేరకు వుంది?
ఇందులో హీరోకే కాకుండా హీరోయిన్‌ పాత్రకూ ప్రాధాన్యత వుంది. మరో నాయిక కేథరిన్‌ పాత్రకూ కథకు మంచి సంబంధముంది. ఇందులో నా పేరు మహాలక్ష్మి అయినా.. హీరో.. పెట్‌నేమ్‌తో పిలుస్తాడు. అదే బాగా పాపులర్‌ అవుతుందనుకుంటున్నా.
 
రామ్‌ చరణ్‌, అర్జున్‌లో ఎవరి గొప్ప డాన్సర్‌?
ఇద్దరితో సినిమాలు చేశాను. ఇద్దరూ బాగా డాన్స్‌ చేయగలరు. అసలు వారి శరీరాల్లో ఎముకలు లేవా? అన్నట్లుగా వారు చాలా సులువుగా బాడీని తిప్పేస్తుంటారు.
 
కమర్షియల్‌ నటిగా ఒకేతరహా పాత్రలు విసుగుపుట్టలేదా?
లేదు. నేను చేస్తున్న సినిమాలన్నీ ఇష్టప్రకారమే చేశాను. కానీ.. హిందీలోని 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే'లాంటి చక్కటి ప్రేమకథలో నటించాలని ఎప్పటినుంచో వుంది.  అలాగే జబ్‌వి మెట్‌, ఆషికి  వంటి సినిమాల్లో నటించడమంటే ఇష్టం. అదేకాకుండా స్పోర్ట్స్‌ నేపథ్యంలో సినిమా చేయాలనుంది. ఏదైనా అవకాశాలు వస్తేనే ప్రయోగాలు చేయగలను. అంతవరకు కమర్షియల్‌గా చేస్తూనే వుంటాను.
 
ఒత్తిడికి గురయితే ఏం చేస్తారు?
ఇటీవలే చాలాచోట్ల ఒత్తిడికి తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చదివాను. ముందుగా మన పనిని మనం ప్రేమించాలి. అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కోసారి ఆలస్యమవుతుంది కూడా. నా చుట్టూ వుండేవారితో స్నేహంగా వుంటాను. షూటింగ్‌ అయ్యాక నా స్నేహితులతో కలిసి మామూలు అమ్మాయిలా వుండాలనుకుంటాను.
 
ఇక్కడే స్థిరపడినట్లు తెలిసింది?
అవును. హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొని ఇక్కడే వుంటున్నా. ఇటీవలే ఫిట్‌నెస్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాను. బాగానే ఆదరణ వుంది. పెట్టిన నెలరోజుల్లోనే వందమంది మెంబర్స్‌ అయ్యారు. ఇందులో ప్రత్యేకత ఏమంటే.. ఒకసారి బరువు తగ్గితే తర్వాత అస్సలు పెరగరు.
 
ఆ ఇల్లు ఎవరో కొని ఇచ్చారనే వార్తలు కూడా విన్పించాయి?
నేను ఒక్కో రూపాయి పోగుచేసి కొన్నాను. ప్రతి మనిషికి ఇల్లు అనేది కల. నేను అలా ప్లాన్‌ చేసుకుని కొన్నాను. నాకు ఎవరూ కొని ఇవ్వలేదు. నా ప్రతి విషయంలో నాన్నగారు ప్రమేయం వుంటుంది. ఆయన చాలా కేర్‌ తీసుకుంటాను. ఎంత హీరోయినన్‌ అయినా.. ఆయనకు కూతురినేగదా. మొదటినుంచి మంచి అమ్మాయిగా పెంచారు. ఏ చిన్న తప్పుచేసినా కొడతారు. సో.. జాగ్రత్తగా జీవితాన్ని ప్లాన్‌ చేసుకుంటున్నాను. నా పారితోషికం, ఇతరత్రా వివరాలన్నీ నాన్నగారే చూసుకుంటారు.
 
కొత్త చిత్రాలు ఏమైనా చేస్తున్నారా?
రామ్‌ చరణ్‌తో తమిళ సినిమా 'తని ఒరువన్‌' రీమేక్‌ల చేస్తున్నాను. వచ్చే నెలలో షూటింగ్‌ కాశ్మీర్‌లో వుంటుంది. అలాగే సాయిధరమ్‌తేజ్‌తో మరో సినిమా. అది కూడా మేలోనే.
 
వరుసగా మెగా ఫ్యామిలీ హీరోలతో చేస్తున్నారే?
ఏదీ ప్లాన్‌ చేసి చేయడంలేదు. అలా నాకు సినిమాలు వస్తున్నాయి. వచ్చినవాటిని చేసుకుంటూ పోతున్నాను అని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

Show comments