పెద్ద హీరోలు డేట్స్‌ ఇవ్వని రోజు నాకూ వస్తుంది : పూరీ జగన్నాథ్‌

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2014 (19:37 IST)
పూరీ జగన్నాథ్‌ పలువురు అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. ఎన్‌టిఆర్‌, మహేష్‌ బాబు, రవితేజ వంటివారితో చేసిన ఆయన భవిష్యత్‌లో తనూ అగ్రహీరోలతో చేయాలంటే... వారు మొహం చాటేసే రోజూ కూడా లేక పోలేదని తెలుసుకున్నానంటున్నారు. అసలు ఏమిటి ఆ కథాకమామిషు.. ఆయన మాటల్లో.....
 
పూరీ రాసిన ప్రేమకథ... ఎవరి కోసం రాశారు? 
'రోమియో' చిత్ర కథ. ఇది నేను ఐదేళ్ళనాడు రాసుకున్న కథ. ఎవరి కోసమో రాసుకోలేదు. కేవలం సాయిరామ్‌ శంకర్‌ కోసమే రాసుకున్నాను. అందుకే 'పూరీ రాసిన ప్రేమకథ' అని కాప్షన్‌ పెట్టుకున్నాను.
 
మీ తమ్ముడ్ని హీరోగా మీ దర్శకత్వంలో చేయకపోవడానికి కారణం? 
నేను చేయకపోయినా.. నా అసిస్టెంట్‌ గోపీగణేష్‌ చేశాడు. నేను కూడా ఇలా చేయలేను.. అన్నంతగా ఆయన చేశాడు. ఎక్కువ భాగం రోమ్‌, స్విట్జర్లాండ్‌, వైజాగ్‌లలో షూటింగ్‌ చేశారు. దొరైస్వామి నిర్మాత.  అలోనిక కొత్త అమ్మాయి బాగా నటించింది.
 
మీ చిత్రాలు భారీగా వుంటాయా? 
అలాంటిది లేదు. లిమిటెడ్‌ బడ్జెట్‌తో సినిమా చేయాలని మొదల్లో చేశాను. కానీ రానురాను నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టే సినిమాలు అడుగుతున్నారు. దాంతో ఆ తరహా చిత్రాలే తీస్తున్నా.
 
లో బడ్జెట్‌ చిత్రాలు తీసే ఆలోచన లేదా? 
ఉంది. దానికి వచ్చే ఏడాది నుంచి శ్రీకారం చుట్టబోతున్నాను. నా బేనర్‌లో కొత్త టెక్నీషియన్స్‌, నటీనటుల్ని పరిచయం చేయబోతున్నా. దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
 
అంటే.. మీరు చిన్న చిత్రాలు తీయరా? 
తప్పకుండా తీస్తాను. ఈ విషయమై దాసరి నారాయణరావుగారు ఓ సందర్భంలో ఇలా చెప్పారు. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు. ఏదో రోజు పెద్ద హీరోలు నీతో సినిమాలు చేయని రోజు వస్తుంది. అది తెలుసుకుని.. అప్పుడప్పుడు చిన్న బడ్జెట్‌ సినిమాలు తీయమని చెప్పారు. అది కాకుండా.. ఇండస్ట్రీని 100 సినిమాల్లో 90 శాతం చిన్న చిత్రాలే రన్‌ చేస్తున్నాయని కూడా వెల్లడించారు. ఆయన మాట వేదవాక్కులా అనిపించింది. అందుకే నా బేనర్‌లో నాతోపాటు కొత్తవారిని పరిచయం చేస్తాను.
 
'రోమియో', జూలియట్‌.. అనేవి మన నేటివిటీ కాదుగదా? 
అవును. వెనీస్‌లో 'నేను నా రాక్షసి' సినిమా షూటింగ్‌లో వుండగా.. అక్కడ రోమియో, జూలియట్‌ లవర్స్‌... స్థూపం చూశాను. అక్కడ ప్రేమికులు లక్షలాది మంది వస్తుంటారు. జూలియట్‌ స్టాచ్యూ కూడా వుంది. అక్కడికి వెళ్ళి.. తమ ప్రేమ సక్సెస్‌ కావాలని కోరుకుంటారు. ఆ టైమ్‌లో నాకు వచ్చిన ఐడియాను కథ రూపంలో రాసేశాను. అదే రోమియో కథ.
 
'రోమియో'లో రవితేజ గెస్ట్‌ రోలా? 
గెస్ట్‌ రోలా అంటే.. అలాగే ఉన్నా.. కథలో కీలకం. హీరో సాయిరాం శంకర్‌కు బ్రదర్‌.. కథలో కీలకమైన పాత్ర అది.
 
ఈమధ్య రచయితలు విదేశీ ప్రేమకథలు రాస్తున్నారు? 
ప్రేమకథలు విదేశమా? స్వదేశమా? అనేది కాదు. ప్రేమకథలు ఎక్కడైనా ఒక్కటే. 100 నేటివిటీ ప్రేమకథలు వస్తుంటే.. అందులో నాబోటి వాడిది ఒక్క విదేశీ ప్రేమకథ వస్తే చాలా కొత్తగా అనిపిస్తుందని నా అభిప్రాయం.
 
ఎన్‌టిఆర్‌తో మళ్ళీ పోలీసుగానా? 
అవును. ఎన్‌టిఆర్ తో పోలీస్‌ ఆఫీసర్‌గా చూపించే చిత్రం చేస్తున్నాను. ప్రస్తుతం వైజాగ్‌లో షెడ్యూల్‌ చేస్తున్నాం. ఇందులో కొత్తగా ఎన్‌టిఆర్‌ కన్పిస్తాడు.
 
మహేష్‌ బాబు సినిమా ఎప్పుడు? 
ఇంకా ఫైనల్‌ కాలేదు. తను చాలా బిజీగా వున్నాడు. కథ సిద్ధంగా వుంది. తను ఫ్రీగా వున్నప్పుడు కథ వినిపిస్తాను. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాను అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారు గొలుసు కోసం వృద్ధురాలిని హత్య- ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దంపతుల దారుణం

జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు అరకు చలి ఉత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం

అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశారు.. ఎక్కడ?

అక్రమ మైనింగ్‌ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి

రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

Show comments