చిరంజీవిగారే ఎన్నో విధాలా సాయపడ్డారు... ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ

Webdunia
శనివారం, 4 అక్టోబరు 2014 (19:23 IST)
'ఆగడు' సినిమా ప్రకాష్‌ రాజ్‌ చేస్తుండగా కోడైరెక్టర్‌కు.. ప్రకాష్‌రాజ్‌కు చిన్నపాటి వివాదం జరిగింది.. దాని గురించి ఆయన చెబుతూ.... అప్పట్లో కోడైరెక్టర్‌ను చెంపపై కొట్టాను. కానీ దానికి ఓ కారణం వుంది. అది తెలుసుకోవాలి. ఏదో వివాదం చేయాలనుకుని శ్రీను వైట్ల చేశాడు. మీడియా కూడా ఎక్కువగా చేసింది. దానికి నేను అప్పుడే క్షమాపణ చెప్పాను. కానీ శ్రీను వైట్ల.. సినిమా విడుదల తర్వాత కూడా నేను అప్పట్లో మీడియా సమావేశంలో చెప్పిన డైలాగ్‌లను సినిమాలో సిగ్గు లేకుండా శ్రీనువైట్ల.. ఇంటర్‌వెల్‌ ముందు సోనూసూద్‌ చేత చెప్పించాడు. ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏమీలేదు. అని చెప్పారు.
 
ఆయన నటించిన సినిమా 'గోవిందుడు అందరివాడేలే' ఒకటవ తేదీన విడుదలైంది. శనివారంనాడు అన్నపూర్ణ ఏడెకారల స్టూడియోలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఆయనతో జరిపిన ఇంటర్య్వూ వివరాలు.
 
ఈ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది? 
కృష్ణవంశీ కథ చెప్పినప్పటి నుంచీ నేను ఒకే మాట చెప్పాను. ఖచ్చితంగా సూపర్‌ హిట్‌. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుంది.
 
కృష్ణవంశీతో చేయడం ఎలా అనిపించింది? 
నేను చాలా హ్యాపీగా వున్నాను. 'గోవిందుడు అందరివాడేలే' నటించడం వల్ల నాకు వచ్చిన పేరుకంటే కృష్ణవంశీ సినిమాలో నటించడం చాలా సంతోషంగా అనిపించింది. నేను గతంలో కోల్పోయిన మధురక్షణాలు మళ్ళీ నాకు గుర్తుకువచ్చాయి.
 
సెట్లో గొడవపడుతున్నారని తెలిసింది? 
పడుతుంటాను. మనం ప్రేమించేవారిని ద్వేషిస్తాం. మళ్ళీ ప్రేమిస్తాం. అది భార్య, స్నేహితుడు ఎవరైనా కావచ్చు. నేను కృష్ణవంశీని ఎంతగా ప్రేమిస్తానో అంతే ద్వేషిస్తాను. అది బయటవరకే.
 
'గోవిందుడు అందరివాడేలే'లో హీరో మీరేనని అంటున్నారు? 
ఈ సినిమాకు కృష్ణవంశీనే హీరో. తను తీర్చిదిద్దే కథ, పాత్రలు ఏదైనా కానీ అందరికంటే నాకు బాగా అర్థమవుతుందని నమ్మకం. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. బాలరాజు వల్ల ఏమైతే చెప్పాలనుకున్నాడో అది ప్రేక్షకులకు చేరింది. సినిమా వల్ల నటుడు పుట్టాలి. నటుడు కోసం ఏ సినిమా పుట్టదు. 'గోవిందుడు అందరివాడేలే'లో సినిమాతో తనకంటూ ఒక శైలి వుందని నిరూపించుకున్నాడు. 
 
ఇందులో ఆయన చూపించిన మానవ బంధాలు, సంబంధాలు, సంస్కృతి అందరి హృదయాల్ని తాకుతాయి. చిరంజీవిగారైనా, నేనైనా, చరణ్‌ అయినా యువన్‌ శంకర్‌ రాజా ఎవరైనా ఎక్కువ పనిచేసిందెవరు, తక్కువ చేసిందెవరు అని పక్కన పెడితే కృష్ణవంశీ చెప్పాలనకున్న విషయాన్ని తెరపై ఆవిష్కరించారు.
 
తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ తీసేయడంపై ఎలా స్పందిస్తారు? 
అది దర్శకుడి ఇష్టం. నేటివిటీ దెబ్బతినకుండా వుండటానికి చేసిన ప్రయత్నమే అది. కథ ముఖ్యం. జనాలకు చేరువవ్వాలనే ఆయన చేసిన ప్రయత్నమని నాతో అన్నారు.
 
చిరంజీవిగారే మిమ్మల్ని సజెస్ట్ చేశారని చెప్పారు? 
అవును. చిరంజీవిగారితో ఎంతో అనుబంధముంది. ఎన్నో విధాలా సాయపడ్డారు. అన్నయ్య అంటే నాకు అపరిమితమైన ప్రేమ. ఆయన సినిమాలు చేయడం అద్భుతమైన జర్నీ. అందుకే రామ్‌ చరణ్‌ని నేను బిడ్డలా చూశాను. అన్నయ్యలో మంచి గుణాలు చరణ్‌లో చూశాను.
 
శ్రీకాంత్‌తో చేయడం ఎలా అనిపించింది? 
శ్రీకాంత్‌ నా బంగారం. తనని చూస్తే నాకు కుళ్ళుగా అనిపిస్తుంది. తను 'వినోదం' సినిమా నుంచి తెలుసు. ఇన్ని సినిమాలు చేసినా తనింకా ఏదో కొత్తగా చేయాలనుకునే వ్యక్తిత్వం. తనలో ఇంకా ఆ ఛాయలు మనకు కనబడతాయి. సినిమా చూస్తుంటే అది మనకు తెలుస్తుంది. ప్రతి నటుడికీ వుండాల్సిన గుణమది.
 
నిర్మాతగా మళ్ళీ సినిమా ఎప్పుడు? 
మంచి కథలు కోసం ఎదురుచూస్తున్నాను. తప్పకుండా చేస్తాను.
 
చిన్న చిత్రాల్లో చేయరా? 
నాకు అన్ని రకాలు సినిమాలు ఒక్కటే. చిన్నపెద్ద తేడాలేదు. నాకు నచ్చిన నాకు వచ్చిన సినిమాలే చేస్తాను. ఇటీవలే ఓ ఆర్ట్‌ సినిమా కూడా చేశాను అని ముగించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)

AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం

Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్

Ajit Pawar, అజిత్‌ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్

RTC Conductor: ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

Show comments