జోష్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన రాధ కుమార్తె కార్తీకకు ఆ తర్వాత మంచి ఆఫర్లు లభించలేదు. అయితే రంగం సినిమా ద్వారా హిట్ కొట్టిన కార్తీక ప్రస్తుతం అల్లరి నరేష్‌తో బ్రదర్ ఆఫ్ బొమ్మాళీలో నటిస్తోంది.
అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ నటిస్తున్న 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' చిత్రంలో కార్తీక ద్విపాత్రాభినయం చేస్తుంది. ఒకటి రష్‌గానూ, రెండోది సంప్రదాయాలు తెలిసిన అమ్మాయిగానూ నటిస్తుంది.
ఇలాంటి పాత్ర రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు కార్తీక చెబుతోంది. ఈ సినిమాను అమ్మిరాజు కాసుమిల్లి నిర్మించారు. బి.చిన్ని దర్శకత్వం వహించారు. కార్తీకతో చిట్ చాట్..
ప్రశ్న: రెండు పాత్రలు చేయాల్సిన అవసరం ఇందులో వుండా?
జ : అదే చిత్రంలో సస్పెన్స్. దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు హీరోకి చెబుతున్నట్లు చెప్పారు. అది నా పాత్రే అని అర్థమయింది. టైటిల్‌కూడా నామీద పెట్టారు. నటనకు మంచి అవకాశం వుంది.
నేను ఇంతటి పాత్ర చేశానంటే దానికి నరేష్ కారణం. హీరో ఒప్పుకోకపోతే ఇలాంటి పాత్ర నాకు రాదు. వున్నా... తర్వాత కట్ చేస్తారు. తర్వాత దర్శకుడికి దక్కుతుంది. ఒక పాత్ర రౌడీలాగా వుంటుంది. రెండోది సాఫ్ట్‌గా వుంటుంది. అది ఏమిటనేది సినిమా.
ప్రశ్న: హీరోయిన్‌గా తమిళంలో చేస్తూ ఇక్కడ సిస్టర్‌గా ఎలా చేయాలనుకున్నారు?
జ : ముందు నాకు అదే అనిపించింది. బ్రదర్ అండ్ సిస్టర్ కథ అన్నారు. ఇంట్రెస్ట్ చూపించలేదు. ముందు కథ వినండి ఆ తర్వాత చెప్పడండి దర్శకుడు చెప్పారు. ఏదో వినాలని విన్నాను. కానీ వింటున్న కొద్దీ ఇది హీరోపాత్రలా అనిపించింది. ఒక హీరో నరేష్. మరో హీరో నేను అన్నమాట. కథకు ఇద్దరు ప్రాణం.
ప్రశ్న : తెలుగులో 'జోష్'తో వచ్చినా అంత జోష్ కెరీర్‌లో లేదేమిటి?
జ : నేను ఆ సినిమా టైంలో టెన్త్ చదువుతున్నాను. ఏక్టింగ్ అంటే తెలీదు. ఏదో సరదాగా చేసేద్దాం అని వచ్చాను. నాకు ఏక్టింగ్ రాదు. కానీ అప్పటికే నాగచైతన్య ఏక్టింగ్ నేర్చుకుని వచ్చాడు. కానీ చేస్తున్నకొద్దీ.... సినిమా అంటే గేమ్‌కాదు. ఇది ఒక వృత్తి. కష్టపడాలి అనిపించింది. అమ్మ పెళ్ళాయక నటనకు దూరంకావడంతో నాకు అవగాహన లేకుండాపోయింది.
ప్రశ్న: 'దమ్ము' ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ : చాలామంది నేను డబ్బుకోసం నటించానని అన్నారు. కానీ ఆ సినిమా ఆడకపోవడం బ్యాడ్‌లక్కే. నాకు డబ్బుతో సంబంధంలేదు. అమ్మ ఇండస్ట్రీ మనిషి. ఆమె వారసురాలిగా మంచి నటిగా రావాలనేది నా ఎయిమ్. సినిమా ప్రపంచం హీరో డామినేట్. అమ్మ టైంలో వేరేగా వుండేది. చిరంజీవిగారితో సమానంగా నటిండచమేకాదు. డాన్స్‌కూడా చేసేది.
ప్రశ్న : 'కో'.. తెలుగులో 'రంగం' ఎలాంటి పేరు తెచ్చింది?
జ : ఈ సినిమా విడుదలయ్యాక... నన్ను నేను మరోసారి అద్దంలో చూసుకున్నాను. నా ఐబ్రోస్ బాగున్నాయని అన్నారు. చాలాచోట్ల బ్యూటీపార్లర్‌నుంచి కార్తీక ఐబ్రోస్ లాగా వుండాలని అడిగేవారట. వారు నాకు ఫోన్లుచేసి చెప్పేవారు. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది.
ప్రశ్న : మరి మీరు బిజీ కాకపోవడానికి కారణం?
జ : నేను నాకు వచ్చిన సినిమాలు చేస్తున్నాను. ఎవరినీ సినిమాలు అడగడలేదు. అందుకే మేనేజర్లను కూడా పెట్టుకోలేదు. నాతో సినిమా చేయాలనుకునేవారు అమ్మతో మాట్లాడతారు. కొన్ని సినిమాలు డబ్బు తీసుకోకుండా ఫ్రీగా చేశాను కూడా. తర్వాత డబ్బు ఇచ్చినా తిరిగి పంపించేశాను.
ప్రశ్న : కొత్త సినిమాలు?
జ : అరున్ విజయ్‌తో 'డీల్' సినిమా చేస్తున్నాను. అది పూర్తయింది. యుటీవీ ప్రొడక్షన్‌లో ఆర్య, విజయ్ సేతుపతితో 'పోరంపోకు' చేస్తున్నాను.
ప్రశ్న : తెలుగులో కొనసాగుతారా?
జ : నేను దక్షిణాది భాషలో నటించాలనుకున్నా. ఒక్క భాషతో పరిమితం కాదు. మాతృభాష మలయాళం. అక్కడా చేస్తున్నాను. తెలుగులోకూడా మాట్లాడతాను. ఇక్కడ మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు.