అలా అనుకుంటే రాజమౌళితోనే చేసేవాడ్ని... నారా రోహిత్‌ ఇంటర్వ్యూ

నారా చంద్రబాబు వారసుడిగా సినిమా రంగంలో 'బాణం' వదిలినా.. నటుడిగా స్థిరపడాలంటే అంత ఈజీ కాదనీ.. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ పెద్దగా వుపయోగపదని... నారా రోహిత్‌ అంటున్నాడు.

Webdunia
బుధవారం, 9 మార్చి 2016 (22:22 IST)
నారా చంద్రబాబు వారసుడిగా సినిమా రంగంలో 'బాణం' వదిలినా.. నటుడిగా స్థిరపడాలంటే అంత ఈజీ కాదనీ.. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ పెద్దగా వుపయోగపదని... నారా రోహిత్‌ అంటున్నాడు. ఇదే నెలలో రెండు సినిమాలతో ముందుకు వస్తున్నాడు.   ఈ నెల 11 'తుంటరి', 25న 'సావిత్రి'లతో రాబోతున్నాడు. తమిళంలో ఎ.ఆర్‌. మురగదాస్‌ కథ అందించిన సినిమా 'మాస్‌ కరాటే'. ఈ చిత్రాన్ని తెలుగులో 'తుంటరి'గా రీమేక్‌ చేశారు. నాగేంద్రకుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌తో చిట్‌చాట్‌.
 
రీమేక్‌లో మీకు నచ్చిన అంశం?
హీరో క్యారెక్టరైజేషన్‌ బాగుంది. ఎప్పటినుంచో అలాంటి పాత్ర చేయాలనుకున్నాను.  మురుగదాస్‌ కథ అందించిన తమిళంలో 'మాస్‌ కరాటే' చూశాక , నాకు బాగా నచ్చింది. 
 
తెలుగులో ఏమైనా మార్పులు చేశారా?
అసలు కథకు మా సినిమాకు చాలా మార్పులు చేశాం. ప్రేమ సన్నివేశాలు పూర్తిగా మార్చేశాం. ఎమోషనల్‌ సన్నివేశాలు పెంచాం.
 
దర్శకుడు ప్లాప్‌లో వున్నాడుగదా?
దర్శకుడు కుమార్‌ నాగేంద్ర ఇంతకుముందు 'జోరు' చేశారు. ప్లాప్‌ అయింది. అంతకుముందు ఆయన చేసిన 'గుండెల్లో గోదారి'కి పేరు వచ్చింది. తనలో తగిన ప్రతిభ వుందని తెలిసి తీసుకున్నాం.
 
బాక్సర్‌గా శిక్షణ తీసుకున్నారా?
ఈ సినిమాలో బాక్సర్‌గా కన్పిస్తా. సినిమాలో ఓ భాగమే. నిజమైన బాక్సర్‌ కాదు. దీనికోసం ప్రత్యేక శిక్షణ అంటూ ఏమీలేదు. అదికూడా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది.
 
సినిమాల స్పీడ్‌ పెంచారే?
వరుసగా చేస్తున్నానని ఎలాంటి గందరగోళంలో లేను. ప్రతి పాత్ర అనుకున్నట్లుగా డిజైన్‌ చేసి చేస్తున్నా. ఇంతకు ముందు ఏడాదికి ఒక సినిమా చేసేవాడ్ని. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నానంటే సమయం చిక్కింది.
 
ఒకే నెలలో రెండు చిత్రాలు విడుదల టెన్షన్‌లేదా?
ఇప్పటి స్థితిలో సినిమా లైఫ్‌.. రెండు వారాలే. సినిమా సినిమాకు రెండు వారాలు గ్యాప్‌ వుంటే చాలు. అందుకే ఈనెల 11న తుంటరి.. 25న సావిత్రి విడుదల చేస్తున్నాం. రెండూ భిన్నమైన కాన్సెప్ట్‌లే.
 
సిక్స్‌ప్యాక్‌ చేస్తానని గతంలో చెప్పారు?
అనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. అయితే జూన్‌లో ఓ సినిమా మొదలవుతుంది. దీనికోసం ఖచ్చితంగా బరువు తగ్గాలి. పాత్ర అలాంటిది. సో... మూడు నెలలు గ్యాప్‌ వుందికాబట్టి.. సిక్స్‌ప్యాక్‌ ఆ సినిమాకు చూపిస్తా.
 
సినిమాలపై రాజకీయ ప్రభావం వుందా?
లేనేలేదు. మా పెద్దనాన్న ముఖ్యమంత్రి కదా! అని నేను అనుకున్నట్లు ఏదీ జరగదు. రాజకీయ ప్రభావమే వుంటే రాజమౌళి వంటి అగ్ర దర్శకులతో పనిచేసేవాడ్ని. నేను కథల్నే నమ్ముతాను.
 
బాలకృష్ణ వందో సినిమాలో నటిస్తున్నారని వార్త వచ్చింది?
ఆ విషయంలో ఇంకా క్లారిటీలేదు. కానీ సినిమాలో నటించమని అడిగితే ఏ పాత్ర అనేది ఆలోచించకుండా ఖచ్చితంగా చేస్తా.
 
తదుపరి చిత్రాలు?
'సావిత్రి' తర్వాత 'పండుగలా వచ్చాడు' సినిమా జూన్‌లో విడుదలవుతుంది. ఆ తర్వాత 'అప్పట్లో ఒకడుండేవాడు', 'నీది నాది ఒకే కథ' సినిమాలు చిత్రీకరణ పూర్తయ్యాయి. ఇవి కాకుండా మరో ఆరు సినిమాలు చేయాల్సివుంది అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

Show comments