నచ్చితే ఎవరితోనైనా ఓకే...: 'అందాల రాక్షసి' లావణ్య

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2015 (20:55 IST)
'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి లావణ్య త్రిపాఠి. 'దూసుకెళ్తా', 'భలేభలే మగాడివోయ్‌' చిత్రాల్లో గుర్తింపు పొందింది. తాజాగా 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' చిత్రంలో నటిస్తోంది. త్వరలో విడుదల కానుంది. కాగా,  మంగళవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్‌.
 
నటిగా గ్యాప్‌ ఇచ్చారే?
అవును. 'దూసుకెళ్తా' సినిమా చేశాక.. ఆ తరహా పాత్రలే వస్తున్నాయి. దాంతో చేయడం ఇష్టంలేక విరామం తీసుకున్నాను. అప్పుడు 'భలేభలే మగాడివోయ్‌' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి ముందే ఖాళీగా వుండడం ఇష్టంలేక కథక్‌ నేర్చుకున్నాను. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాలో కూడా కథక్‌ చేసే సీన్స్‌ ఉంటాయి.
 
'లచ్చిందేవికి ఓ లెక్కుంది' అంటే ఏమిటి?
సినిమాలో నాది కీలక పాత్ర. నేను చేసే పనికి ఓ లెక్కంటుంది. అదేమిటో సినిమాలో చూడాల్సిందే. ఇందులో మూడు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను. అంకాలమ్మ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అందులో అందరిని భయపెట్టే ఒక పాట ఉంటుంది. ఆ సినిమా రిలీజ్‌ కోసం చాలా ఎగ్జైటెడ్‌‌గా ఎదురుచూస్తున్నాను. క్రైమ్‌, కామెడీ నేపధ్యంలో సాగే కథ.
 
గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌ సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందే?
అల్లు శిరీష్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను. అందులో కాలేజీకు వెళ్ళే అమ్మాయి పాత్ర. డిఫరెంట్‌ రోల్‌ అని చెప్పలేను కాని నేను డిఫరెంట్‌గా చేయడానికి ప్రయత్నించాను. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. సిటీ బ్యాక్‌‌డ్రాప్‌లో నడిచే కథ.
 
అప్పుడు నాగచైతన్య, ఇప్పుడు నాగార్జునతో నటించడం ఎలా అనిపిస్తుంది?
'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో సంప్రదాయకంగా కనిపిస్తాను. అమ్మాయిలు చీరల్లో చాలా అందంగా కనిపిస్తారు. సినిమా మొదలయినప్పటి నుండి చివరి వరకు నేను చీరల్లోనే కనిపిస్తాను. సినిమాలో మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. అందుకే సెలక్ట్‌ చేసుకున్నాను. అయితే నాగార్జున గారితో నటిస్తున్నాను కదా.. అని వాళ్ళ పిల్లలతో నటించనని నేను చెప్పను. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ముందే నాగచైతన్యతో సినిమా చేశాను. అవకాశం వస్తే మరోసారి కూడా నటిస్తాను. అఖిల్‌తో ఛాన్స్‌ వచ్చిన ఓకే చెప్తాను. నేను క్యారెక్టర్‌ మాత్రమే చూస్తాను. నచ్చితే ఎవరితో అయినా.. కలిసి నటిస్తాను.
 
రాజమౌళిగారు మిమ్మలి ఓ పాత్రకు అడిగారటగదా?
'బాహుబలి 2' సినిమాలో నటిస్తున్నాని వచ్చిన వార్తల్లో నిజం లేదు. అవన్నీ రూమర్స్‌ మాత్రమే. కాని నిజంగా రాజమౌళి గారు నటించమని అడిగితే ఏ పాత్రలో అయినా నటిస్తాను. బ్యాక్‌‌గ్రౌండ్‌లో ఉన్నా పర్వాలేదు.
 
ఇప్పటివరకు కెరీర్‌ ఎలా వుందనుకుంటున్నారు?
నా మొదటి సినిమా తరువాత అలాంటి పాత్రలు మాత్రమే చేయగలనని అందరు అనుకున్నారు. కాని నేను భిన్నమైన పాత్రల్లో నటించాలనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే అన్ని మంచి రోల్స్‌ వస్తున్నాయి. నా జర్నీలో చాలా సంతోషంగా ఉన్నాను. స్క్రిప్ట్స్‌ ఎన్నుకునేప్పుడు కథ, డైరెక్టర్‌ను బట్టి సెలక్ట్‌ చేసుకుంటాను. ముందుగా కథ నన్ను తృప్తి పరచాలి. స్టొరీ నేను ఎంజాయ్‌ చేసే విధంగా ఉంటేనే ఒప్పుకుంటాను. తమిళంలో ఆఫర్లు వస్తున్నాయి కాని నాకు సమయం దొరకడం లేదు. తెలుగులోనే చేయాలనుంది. హిందీలో ఆఫర్లు వచ్చినా.. తెలుగులో మాత్రం నటించడం మానను.
 
ఖాళీ సమయాల్లో మీ వ్యాపకం? 
ఖాళీ సమయాల్లో సినిమాలు, టివి సిరీస్‌ చూస్తాను. రాత్రి పూట ఫ్రెండ్స్‌తో తిరుగుతాను. నాకు హైదరాబాద్‌ బాగా నచ్చింది. ఇక్కడ ఇల్లు కూడా కొనుక్కోవడానికి ప్లాన్‌ చేస్తున్నాం. 'ఉలవచారు బిరియాని' ఇష్టంతో తింటాను. నేను శాఖాహారిని. చికెన్‌ బిరియానిలో చికెన్‌ తీసేసి బిరియాని తింటాను అని తెలిపారు లావణ్య.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కూడా నారా లోకేష్ సీఎం కావడానికి మద్దతు ఇస్తారు.. ఆదినారాయణ రెడ్డి

భర్త కుటుంబం వేధింపులు.. కట్టుకున్న వాడితో గొడవలు.. కన్నబిడ్డలతో వివాహిత ఆత్మహత్య

ఏమండీ... మన అబ్బాయిని నేనే చంపేసానంటూ భర్త వద్ద బావురుమంది

Hyderabad: నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని చెప్పి.. సామూహిక అత్యాచారం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హాజరైన బీఆర్ఎస్ నేత హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

Show comments