Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొరాకోలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''

Webdunia
బుధవారం, 25 మే 2016 (10:40 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితకథను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా మొరాకోలో జరిగింది. మొరాకోలోని అట్లాస్ స్టూడియోస్‌లో వరు జార్జియస్‌లో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణ , కబీర్ బేడీలతో పోరాట సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. దాదాపు 1000 మందితో భారీ సన్నివేశాలను పూర్తి చేశారు. 
 
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంతవరకూ మొరాకోలో హాలీవుడ్ సినిమా షూటింగులు మాత్రమే జరుగుతూ వచ్చాయి. ఈ చిత్రం తాజాగా మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభంకానుంది. అయితే ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు మాత్రమే మొరాకోలో షూటింగ్ జరుపుకోగా, తొలిసారి ఓ ఇండియన్ చిత్రం, అదీ మన తెలుగు చిత్రం మొరాకోలో రెండు వారాల పాటు షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఈ సినిమా షూటింగులో రెండు వందల గుర్రాలను.. రెండు వందల ఒంటెలను ఉపయోగించడం ఇంకో విశేషం. ఇంకా ఈ చిత్రం విడుదలై ఇంకెన్నిరికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments