అప్పుడు పేషెంట్‌లా ఉన్నా... ఇప్పుడు 'బెంగాల్ టైగర్‌'నయ్యా...: రవితేజ ఇంటర్వ్యూ

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2015 (18:49 IST)
రవితేజ.. ఈ పేరులోనే ఎనర్జీ వుంది. నటనలో ఈజ్‌ వుంది. ఇడియట్‌ అన్నా.. నేనింతే అన్నా... ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్నా.. ఒక్కోటి ఒక్కో తరహాలో చిత్రాలు చేసుకుంటూపోతున్న ఆయన ఎందరికో స్పూర్తిగా నిలిచారు. ఇప్పటి కొంతమంది హీరోలు రవితేజ స్పూర్తిగా చెబుతుంటారు. కొత్త దర్శకులయితే ఆయన మాకు లైఫ్‌ ఇచ్చారంటారు. ఇలా ఎందరో కొత్త దర్శకుల్ని ప్రోత్సహించిన ఆయన 'లైఫ్‌' అనే పదం తప్పని... ఇక్కడ ఎవరూ ఎవరికీ లైఫ్‌ ఇవ్వరని.. ప్రతిభ వుంటే ప్రోత్సహిస్తారని స్పష్టం చేస్తున్నారు. కిక్‌-2 కాస్త నిరాశపర్చినా.. బెంగాల్‌ టైగర్‌తో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ సందర్భంగా రవితేజతో చిట్‌చాట్‌.
 
బెంగాల్‌ టైగర్‌ గురించి ఒక్కముక్కలో ఏం చెబుతారు?
మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.
 
చాలా చేశారు కదా.. ఈ సినిమా ఎందుకు చూడాలి?
కథలో కొత్తదనం వుంది. లుక్‌లోనూ భిన్నత్వం వుంది. పాటలు ఫ్రెష్‌గా వన్నాయి.. బీమ్స్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి నచ్చుతాయి.
 
భీమ్స్‌ను ఎంపిక చేయడానికి కారణం?
తను ఇప్పటికే మంచి సంగీతం చేశాడు. చాలా పాపులర్‌ అయ్యాయి. దర్శకుడు సంపత్‌నంది తీసుకువచ్చి మంచి ట్యూన్‌ ఇస్తున్నాడు ఒకసారి చూడండి అన్నాడు. అప్పటికే ఆయన గురించి తెలుసు. తనతో చేయాలనుంది. ఈయన రావడంతో సరిగ్గా సరిపోయింది. కొన్ని ట్యూన్స్‌ వినిపించాడు. తను సౌండ్‌, ఆర్కెస్ట్రా బాగా వచ్చింది. అందుకు తగినట్లే పాటలకు రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా కూడా సక్సెస్‌ అయి తనకు మంచి అవకాశాలు మరిన్ని వస్తాయనే నమ్మకముంది.
 
ఫ్లాష్‌బ్యాక్‌ నెరేషన్‌ చేయగానే 'ఎస్'‌ అని చెప్పారు. అంతగా నచ్చిన అంశం ఏమిటి?
అవును. దర్శకుడు చెప్పగానే వెంటనే కనెక్ట్‌ అయ్యాను. అది చెప్పడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది. మనం ఓ కథ అనుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చాలనుకుంటాం. రేపు చూశాక.. ప్రేక్షకులు తీర్పు ఇస్తారు. ఇందులో కథకు ఫ్లాష్‌బ్యాక్‌ కరెక్ట్‌గా కనెక్ట్‌ అయింది. మిగిలిన కథకు ఆ ఫ్లాష్‌ బ్యాక్‌ లింకు సరిగ్గా సరిపోయింది.
 
బెంగాల్‌ టైగర్‌ పేరు పెట్టడానికి కారణం?
క్యారెక్టర్‌కు సూటయ్యే టైటిల్‌. ముందుగా తను వేరే సినిమాకు అనుకున్నాడు. కానీ దానికి పెట్టలేకపోయాడు. ఈ సినిమాకు నాకు రాసిపెట్టి వుంది.
 
టైటిల్‌లో విక్రమార్కుడంత ఫోర్స్‌ వుంది?
అవును. ఇదే ఫీడ్‌బ్యాక్‌ నాకు కావాలి. అందరూ అలా ఫీలయితే చాలు.
 
ద్విపాత్రాభినయం చేశారు?
డ్యూయల్‌ రోల్‌కాదు. చాలామంది చాలారకాలుగా అనుకుంటున్నారు. బెంగాల్‌ నేపథ్యం అనీ ఇలా రకరకాలుగా వస్తున్నాయి. పర్టిక్యుల్‌గా బెంగాల్‌ టైగర్స్‌ ఇంటిలిజెంట్‌గా వుంటాయంటారు. అంతలా ఈ పాత్ర వుంటుంది. అదే జస్టిఫికేషన్‌.
 
ఇద్దరు పవ్‌ఫుల్‌ వ్యక్తుల గేమ్‌ అని దర్శకులు అన్నారు?
అవును.. అదే. నిజం. ఆ పవర్‌ఫుల్‌ వ్యక్తులు ఎలాంటి గేమ్‌ ఆడారో తెరపై ఎంటర్‌టైన్‌గా చూడొచ్చు.
 
ఇందులో పొలిటికల్‌గా సెటైర్లు వున్నాయా?
అలాంటివి ఏమీలేదు. పాజిటివ్‌ తప్ప నెగెటివ్‌ లేదు. ల్యాండ్‌ మాఫియా నేపథ్యం కాదు. అలాగనీ  సందేశాలు ఏమీలేవు. నేనైతే ఏ సందేశం ఇవ్వలేదు. ఎవరిచేతనైనా ఇప్పించాడేమో తెలీదు.
 
102 జ్వరంతో కూడా నటించారట?
అవును. అంతకుముందు జ్వరం బాగా వుంది. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ జరగాలి. నిర్మాత చాలా ఖర్చుపెట్టారు. దాన్ని వృధా చేయకూడదు. అందుకే చేశాను. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చేసరికి ఫీవర్‌ కూడా ఎగిరిపోయింది.
 
డాన్స్‌ ఇలా వుండాలని కొరియోగ్రాఫర్స్‌ ఫోర్స్‌ చేశారా?
ఏ సినిమాకైనా డాన్స్‌ బాగానే వుంటుంది. నా గత చిత్రాల్లోనూ డాన్స్‌ చేశాను. అలాగే ఇందులోనూ చేశాను. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్స్‌ ఏ ఫోర్స్‌ చేయలేదు. అసలు నేను ఇష్టం లేకుండా ఏదీ చేయను. ఇష్టపడే చేస్తాను. అటు వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ అంతే.
 
దర్శకులకు జనరల్‌గా సలహాలు ఇస్తుంటారా?
స్క్రిప్ట్‌ అనుకున్నాక అందులో మంచిచెడుల గురించి చర్చించుకుంటాం. ఇది బాగుంది. అది పెడితే ఇంకా బాగుటుంది.. అనేవి మాట్లాడుకుంటాం. దాన్ని రిసీవ్‌ చేసుకునే విధానం దర్శకుడికి తెలియాలి. ఇక్కడ ఎలాంటి ఇగోలకు తావులేదు. ఇమేజ్‌కు అడ్డమని.. అలా పెట్టమని.. ఇలా పెట్టమని ఎప్పుడూ చెప్పలేదు. కథలు కొత్తగా వుండాలి. కథనం కొత్తగా చూపిస్తే ప్రేక్షకుడు కనెక్ట్‌ అవుతాడు.
 
మళ్ళీ 'ఔను వాళ్లిద్దరూ..' తరహా ప్రయోగాలు చేస్తారా?
ప్రయోగాలు చేయడం మామూలే. కొన్ని ప్రయోగాలు సక్సెస్‌ ఇస్తాయి. కొన్ని ఫెయిల్యూర్స్‌ ఇస్తాయి. ఔను వాళ్లిద్దరూ.. శంభో శివ శంబో, నేనింతే చిత్రాలు చేశాను. అన్నీ బాగనే వున్నాయి. నేనింతే సినిమా చాలాసార్లు టీవీల్లో వచ్చింది. చూసినవారంతా చాలా బాగుందన్నారు. ఎక్కడ నెగెటివ్‌ టాక్‌ లేదు. కానీ ప్రేక్షకుడు చూడలేదంతే. 
 
దర్శకత్వం చేసే ఉద్దేశ్యం వుందా?
ఇది రొటీన్‌గా చెప్పేదయినా... ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా నా దర్శకత్వంలోనే చేస్తా. అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను.
 
హీరోలు నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. మీరు కూడా..?
నాకు నిర్మాణరంగం గురించి తెలీదు. తెలిసిన పని చేయడమే బెటర్‌.
 
పలు దర్శకులకు లైఫ్‌ ఇచ్చారు. దీనిపై..?
లైఫ్‌ అనేది నా దృష్టిలో కరెక్ట్‌ పదం కాదు. ఇక్కడ ఎవరూ ఎవరికీ లైఫ్‌ ఇవ్వరు. టాలెంట్‌ వుంటే ప్రోత్సహిస్తారు. నేను ఒకరితో కలిసి వున్నానంటే.. ఆయన గురించి నాకు తెలుసు. నా గురించి ఆయనకు తెలుసు. నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టేలా ధైర్యంగా ముందుకు సాగుతాను. ముఖ్యంగా నమ్మకం వుండాలి. ఆ నమ్మకంతోనే నన్ను కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్‌ ఎంకరేజ్‌ చేశారు. ఇప్పుడు కొత్త దర్శకుడు చక్రితో చేయబోతున్నా. తను 'బలుపు' నుంచి నాతో ట్రావెల్‌ అయ్యాడు. అలా ట్రావెల్‌లోనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది.
 
బొమన్‌ ఇరాని నుంచి ఏం నేర్చుకున్నారు?
తను చాలా గొప్ప నటుడు. ఆయన్నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. చిన్నచిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా నచ్చుతాయి. అవి చూసి గ్రహించాను. సినిమాకు అవే హైలైట్‌ అవుతాయి. ఆయనతో ఎంతసేపు మాట్లాడినా తెగ మాట్లాడేస్తుంటారు. భాషపై ఆయనకు చాలా ఇంట్రెస్ట్‌ వుంది. రెండు రోజుల ముందుగానే వచ్చి.. పాత్ర గురించి డైలాగ్స్‌ గురించి తెలుసుకునేవాడు.
 
తమన్నా, రాశీఖన్నాలు ఎలా నటించారు?
తమన్నా ఇప్పటికే నిరూపించబడిన నటి. పాజిటివ్‌గా ఆలోచించే మనిషి. భాష నేర్చుకుని నటిస్తుంది. రాశీఖన్నా కూడా తెలుగు నేర్చుకుంది. ఆమెకు మంచి మెమరీ పవర్‌ వుంది. నటిగా మరో మెట్టు ఎదుగుతుంది.
 
'బాహుబలి'తో తెలుగు మార్కెట్‌ పెరిగింది. మీ సినిమా ఆ రేంజ్‌కు చేరుతుందా?
ఈ విషయంలో రాజమౌళికి ఎన్నిసార్లయినా అభినందించాల్సిందే. డబ్బింగ్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చేలా పలు భాషల్లో చేయడం మామూలు విషయం కాదు. అంతలా నా సినిమా క్రాస్‌ అవుతుందని అనుకోవడంలేదు.
 
అన్నీ ఇష్టపడే చేస్తున్నారు. కానీ ఫెయిల్యూర్స్‌ వున్నాయి. ప్రేక్షకులు చూసే విధానంలో తేడా వుందంటారా?
ప్రేక్షకులు ఎప్పుడూ ఛేంజ్‌ కారు. హిట్లు, ప్లాప్‌లు మామూలే. తెలుగు ప్రేక్షకులు చాలా మంచోళ్ళు. ఒక్కసారి ఇష్టపడితే చాలు. వదలరు. నాకు నచ్చేవి అందరికీ నచ్చాలనేది లేదు. ఒకసారి మనకు నచ్చదు, కానీ వారికి నచ్చుతుంది.
 
కిక్‌..2కు బాగా సన్నగా వున్నారు.  ఇప్పుడు మారారు కారణం?
తగ్గడం, పెరగడం అనేది వ్యాయాయంలో ఒక భాగం. బాడీ వర్కవుట్‌ పరంగా ఇలా జరుగుతుంది. ఇది అందరికీ అర్థంకాదు. కొత్తగా చూసేవాడికి.. వీడేండి! పేషెంట్‌లా వున్నాడనిపిస్తుంది. ఇది వర్కవుట్‌లో ఓ భాగం మాత్రమే. దాన్ని అందరికీ వివరించలేను. ఆ టైమ్‌లో ఆ సినిమా వచ్చిందంతే. ఇప్పుడు మామూలు పొజిషన్‌కు వచ్చేశాను అని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అనంత్ అంబానీ కోసం జాకబ్ అండ్ కో ప్రత్యేక వాచ్.. ధర ఎంతో తెలుస్తే నోరెళ్లబెడతారు

కేరళలో అధికార మార్పిడి తథ్యం : నరేంద్ర మోడీ

నా గుండె కోసం దెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్నా: ట్రంప్

జైలులో పెళ్లిపీటలెక్కిన హత్య కేసు దోషులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments