'ఆవు పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్ళి', 'కాళకేయ వర్సెస్‌ కాట్రవల్లీ'... ప్రభాకర్ ఇంటర్వ్యూ

విలన్లకు సహాయకుడిగా పలు చిత్రాల్లో నటనను ప్రదర్శించిన ప్రభాకర్‌ ఒక్కసారిగా రాజమౌళి 'బాహుబలి'లోని కాళకేయ పాత్రతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే రాజమౌళినే తన దేవుడని అంటున్న ప్రభాకర్‌.. 'రైట్‌ రైట్‌' అనే చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు. స

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (17:47 IST)
విలన్లకు సహాయకుడిగా పలు చిత్రాల్లో నటనను ప్రదర్శించిన ప్రభాకర్‌ ఒక్కసారిగా రాజమౌళి 'బాహుబలి'లోని కాళకేయ పాత్రతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే రాజమౌళినే తన దేవుడని అంటున్న ప్రభాకర్‌.. 'రైట్‌ రైట్‌' అనే చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జె.వంశీకష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ప్రభాకర్‌ విలేకరులతో ముచ్చటించారు.
 
వరుసగా రాజమౌళి చిత్రాల్లో నటించడం ఎలా అనిపించింది?
విలన్లకు అసిస్టెంట్‌గా చేస్తున్న తనను పిలిచి 'మర్యాద రామన్న' చిత్రంతో గుర్తింపు తెచ్చే పాత్రనిచ్చారు. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వచ్చాయి. అయితే ఎక్కువభాగం సినిమాలు ఒక ఫైట్‌, ఒక సీన్‌తోనే ఉండేవి. అయితే మళ్లీ రాజమౌళిగారు డైరెక్ట్‌ చేసిన 'బాహుబలి'తో చాలా మంచి బ్రేక్‌ వచ్చింది. ఇప్పుడు పరిస్థితి చాలా బావుంది. చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. నా సినిమా కెరీర్‌ పరంగా చూస్తే రాజమౌళిగారే నాకు పెద్ద బ్రేక్‌ ఇచ్చారు.
 
పెద్ద రేంజ్‌లో పేరువచ్చినా మీరు 'రైట్‌ రైట్‌'లో చేయడానికి కారణం?
ఇప్పటి వరకు విలన్‌గానే చేసే నాకు ఒక్కసారిగా పాజిటిల్‌ రోల్‌ చెప్పగానే వెంటనే ఓకే చేశాను. ఈ చిత్రంలో డ్రైవర్‌ పాత్రలో కన్పిస్తా. సెంటిమెంట్‌, ఎమోషన్స్‌ అన్నీ చూపించుకునే పాత్ర చేశాను. నటుడుగా నిరూపించుకునే పాత్ర. ఈ సినిమా మలయాళ వెర్షన్‌ను చూశాను. మలయాళంలో పాత్ర కంటే బెటర్‌గా క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు. డ్యాన్సులు కూడా చేశాను.
 
ఇందులోనే యాస ఉపయోగించారా?
ఎస్‌.కోట నుండి గవిటీకి బస్సు నడిపే డ్రైవర్‌గా కనపడతాను. సాధారణంగా సిటీ నుండి విలేజ్‌కు వెళ్లే బస్‌ డ్రైవర్‌, కండెక్టర్‌ అక్కడే రాత్రి స్టే చేసి తర్వాత పొద్దున్నే తిరుగు ప్రయాణం చేస్తుంటారు. అందువల్ల అక్కడి పల్లె ప్రజలతో మంచి సంబంధాలుంటాయి. అలాగే అక్కడి ప్రజలతో సత్సంబంధాలుండే పాత్రలో కనపడతాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతాను.
 
పాత్ర పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
పాజిటివ్‌ పాత్ర చేయడాన్ని ఎంజాయ్‌ చేశాను. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన పాత్రలకు విలక్షణమైన పాత్ర కావడంతో బాడీలాంగ్వేజ్‌లో మార్పు చూపించాలి. కాబట్టి డైరెక్టర్‌ మనుగారితో, ఎం.ఎస్‌.రాజుగారితో బాగా డిస్కస్‌ చేసేవాడిని. వారి సలహాలు, సూచనలు బాగా వుపయోగపడ్డాయి.
 
కొత్త దర్శకుడితో ఎలా వుంది?
డైరెక్టర్‌ మను 'దశ్యం' చిత్రంతో సహా పలు చిత్రాలకు కో-డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. ప్రతి రోజు నా పాత్రకు సంబంధించి ముందురోజునే ఏ సన్నివేశాలు చేయాలి! ఎలా చేయాలని చెప్పేవారు. ప్రతిభగల దర్శకుడు.
 
సుమంత్‌ అశ్విన్‌తో నటించడం ఎలా వుంది?
తను ముందుగా పరిచయం లేదు. ఈ సినిమాలో చేసేటప్పుడు ముందు రెండు రోజులు పెద్దగా కలవలేదు. తర్వాత మా మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. తను నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యాడు. ఇద్దరం కలిసి చేసే సీన్స్‌లో డిస్కస్‌ చేసుకుని ఎలా చేస్తే బావుంటుందో ఆలోచించుకుని చేసేవాళ్లం.
 
కెరీర్‌ ఆరంభంలో స్ట్రగుల్‌ పడ్డారా?
స్ట్రగుల్‌కంటే.. కొన్నిసార్లు బాధపడ్డా. ఎందుకంటే... నేను విలన్‌గా చేసినప్పుడు నా ఫ్రెండ్స్‌, తెలిసినవాళ్లంతా ఏంట్రా! ఏదో సీన్‌లో కానీ, ఫైట్‌లో కానీ రౌడీగానే నీ పని అనేవారు. దాంతో మనసులో చిన్న బాధ కలిగేది. ఈ సినిమాతో ఆ బాధ తీరిపోయింది.
 
బాహుబలికి అంతర్జాతీయ గుర్తింపు మీకెలా లాభించింది?
సినిమాతోపాటు నాకూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చింది. సినిమా విడుదల సమయంలో చాలా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అలాగే గోవా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ జరిగినప్పుడు అక్కడ ఉన్న విదేశీయులు చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. విదేశీయులు కూడా నా నటనను మెచ్చుకోవడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.
 
కొత్త చిత్రాలు...
'ఆక్సిజన్‌'లో టిపికల్‌ విలన్‌గా కనపడతాను. అలాగే 'ఆవు పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్ళి', 'కాళకేయ వర్సెస్‌ కాట్రవల్లీ' సినిమాలతో సహా మలయాళంలో మోహన్‌లాల్‌ గారితో సినిమా చేస్తున్నాను. అలాగే కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నానని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్యసభకు ఆర్ఆర్ఆర్.. జూన్ నాటికి ఆ నాలుగు స్థానాలు ఖాళీ

స్పేస్‌కు వీడ్కోలు చెప్పిన సునీత విలియమ్స్.. నాసాకు బైబై.. 62 గంటల 6 నిమిషాలు

బరువు తగ్గాలనుకుంది.. ఆ మందు తిని ప్రాణాలు కోల్పోయింది...

మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు.. 4వేల బస్సులు నడుపుతాం.. పొన్నం

రెండేళ్లలో 416మందితో డేటింగ్.. మహిళ షాకింగ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

తర్వాతి కథనం
Show comments