నాకు ఇంకా పెళ్లి కాలేదు: ఉదయ్ కిరణ్

Webdunia
WD
" చిత్రం" సినిమాతో ఒక్కసారిగా యువకెరటంగా దూసుకెళ్లిన నటుడు ఉదయ్‌కిరణ్. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలు చేసి కొంత విరామం తీసుకున్నా... మళ్లీ అదే స్థితికి చేరాలని ఉవ్విళ్ళూరుతున్నారు. తాజాగా ఆయన "ఏక‌లవ్‌యుడు" అనే చిత్రంలో నటించారు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఉదయ్‌కిరణ్‌తో చిట్‌చాట్...

ప్రశ్న... మీకిష్టమైన వంటకం?
జ... నేను పూర్తి శాఖాహారిని. ఏదైనా ఇంట్లో చేసిందే ఇష్టపడతాను. ఆ రుచే వేరు. పులిహోర అంటే చాలా ఇష్టం.

ప్రశ్న... షూటింగ్‌లో ఉన్నప్పడు ఎలా..?
జ... షూటింగ్ ఉన్నా.. ఇంటి నుంచి కేరియర్ వస్తుంది. అమ్మచేతి వంట కోసం ఎదురుచూస్తుంటా.

ప్రశ్న... చిన్నతనంలో జరిగిన సంఘటనలు..?
జ... మా అక్కయ్య నన్ను పులిహోర అని ఏడిపిస్తుండేది. నేను తింటుంటే ఆశగా చూసేది. ఆ తర్వాత తనూ తినేదనుకోండి...

ప్రశ్న... హాబీలు..?
జ... డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. సిటీలో రాత్రిపూట కారులో తిరుగుతుంటాను. బైక్ ఉన్నప్పుడు కూడా తిరిగే వాడిని. రాత్రి సమయంలో ట్రాఫిక్‌జామ్‌లు ఉండవు గదా... ఇక సంగీతమంటే చాలా ఇష్టం. మంచి మెలోడీ పాటలు వింటుంటే... మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.

ప్రశ్న... పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ... నాకే తెలీదు. ఒక్కోసారి నాకే నా పెళ్లెప్పుడు అనే ఆలోచన వస్తుంది. చాలా మంది నాకు పెళ్లయిందని అనుకుంటున్నారు. బాబోయ్ నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ విషయాన్ని కాస్త హైలైట్ చేయండి... అంటూ ప్రాధేయపడ్డారు.... సో... ఉదయ్ కిరణ్‌కు ఇంకా పెళ్లి కాలేదండీ... అదీ సంగతి...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

Show comments