Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రేమనగర్' నిర్మాత 'రామానాయుడు'తో మాటా మంతీ

Webdunia
గురువారం, 5 జూన్ 2008 (16:50 IST)
FileWD
' ప్రేమనగర్' చిత్రంతో నిర్మాతగా గుర్తింపు సాధించిన డా. డి.రామానాయుడు తెలుగుపరిశ్రమతో సహా పలు భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నీస్ రికార్డు సైతం సాధించారు. కార్యదీక్ష, పట్టుదలే పెట్టుబడిగా ఇండస్ట్రీలో ఎదిగిన ఆయన మనోధైర్యమే ఆయనను ఇంతవాన్ని చేసింది.

జూబ్లిహిల్స్‌లో ఒకనాడు రాళ్లతో నిండిపోయిన ప్రదేశాన్ని సుందరమైన రామానాయుడు స్టూడియోగా తీర్చిదిద్దడంలో ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతాకాదు. అనాడు జూబ్లిహిల్స్‌లో స్టూడియో నిర్మాణానికి చూపించిన అదే ఉత్సాహంతో ఆయన నేడు వైజాగ్‌లోనూ మరో స్టూడియో నిర్మిస్తున్నారు.

ఏడుపదుల వయసు దాటినా కుర్రాడిలా చలాకీతనం ఉట్టిపడే రామానాయుడు శుక్రవారం తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు మాటా మంతి...

కెరీర్ పరంగా వెంకటేష్‌పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
కెరీర్‌పరంగా వెంకటేష్ ఎంతో ఎదిగాడు. రోజూ పనిచేస్తే ఐదులక్షలు వస్తాయి కదా అని అంటే... ఎందుకు డాడీ మనకున్నది చాలదా అంటాడు. అదేమంటే... ఫిలాసపర్‌గా మాట్లాడుతాడు. తనకు నచ్చితేనే సినిమా చేస్తాడు.

గతంలో చంటి సినిమా చేసేటప్పుడు కూడా ఆ చిత్రం నీకు సెట్ కాదు అంటే పట్టుబట్టి చేశాడు. ఆ సినిమాతో వెంకటేశ్ వైవిధ్యమైన పాత్రలు కూడా చేయగలడనే విషయం రుజువైంది. వెంకటేష్ అన్ని రకాల పాత్రలు చేయగలడు.

వైజాగ్‌లో మీరు కడుతున్న స్టూడియో ప్రారంభం ఎప్పుడు?
వైజాగ్‌లో నిర్మించే స్టూడియో దాదాపు పూర్తి అయ్యింది. నిర్మాతకు ఇబ్బందిలేకుండా చిత్రాన్ని నిర్మించడానికి దీనిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. చాలామంది షూటింగుల కోసం అడిగినా మా అబ్బాయి చిత్రంతో మొదలు పెట్టాలని ఆపాను. ఆగస్టులో సిఎం చేతుల మీదుగా ఈ స్టూడియోను ప్రారంభించనున్నాం.

వైజాగ్ స్టూడియో నిర్మాణానికి చాలా కష్టపడ్డాం. అందుకే మా అబ్బాయి అంటుంటాడు జీవితమంతా రాళ్లు పగలగొట్టడానికే సరిపోయిందని. నిజమే... మా స్టూడియోలు, మా అబ్బాల కోసం కట్టిన ఇళ్లు అన్నీ కూడా రాళ్లు పగలగొట్టి నిర్మించినవే.

తండ్రిగా వెంకటేష్‌లో ఏమి గమనించారు?
వెంకటేష్ తను చేసిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ కావాలని కోరుకుంటాడు. హీరోగా ఏ చిత్రానికి కమిట్ అయినా దాన్ని సొంత నిర్మాతలాగా చూసుకుంటాడు. ఎక్కడా వేస్ట్ కానివ్వడు. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న చింతకాయలరవి చిత్రం షూటింగ్ ఫారిన్‌లో జరుగుతోంది. ఆ చిత్ర యూనిట్ బాబు గురించి చెబుతోంటే ఆశ్చర్యమేస్తోంది.

ఇద్దరు కొడుకులు, కూతుళ్ళు, మనవళ్లతో అంతా సంతోషంగా ఉండడం, అంతా కలిసి ఉండడం అదే నా ఆస్తి.


సీక్వెల్స్ వస్తున్న తరుణంలో మీ చిత్రాలు సీక్వెల్స్‌గా చేసే ఆలోచన ఉందా?
చేయాలనే ఉంది. ప్రేమనగర్ చిత్రాన్ని వెంకటేష్‌తో చేయాలని ఉంది. వాడికి సూట్ కాకపోతే నాగార్జునతో అయినా చేయాలి. అలాగే రాముడు-భీముడు చిత్రాన్ని ఎన్.టి.ఆర్‌తోనే చేయాలి. ఆమధ్య చేస్తానని చెప్పాడు. అయితే టైమ్ కలిసి రాలేదు. ఇవికాక సోగ్గాడు చిత్రాన్ని వెంకటేష్‌తో చేయాలని ఉంది అయితే అతను చూద్దాం డాడీ అంటూ వాయిదా వేస్తున్నాడు.

నటుడిగా మీలో తీరని దాహం ఉందా?
నటుడిగా అడపాదడపా పాత్రలు చేసినా పూర్తి స్థాయి పాత్ర చేయలేదు. వెంకటేష్, నేను తండ్రీ కొడుకులుగా చేద్దాం అనుకున్నా వయస్సు రీత్యా సాధ్యం కాలేదు. అందుకే వేరే హీరోగా తండ్రిగా పాత్ర చేయబోతున్నా. వైజాగ్‌లో స్టూడియో ప్రారంభం కాగానే అక్కడే ఆ చిత్రంలో నటిస్తా.

చిరంజీవి రాజకీయ ప్రవేశంపై మీరు ఎలా స్పంధిస్తారు?
ఆనాడు ఎన్.టి.ఆర్ పార్టీ పెట్టారు. ఇప్పుడు చిరంజీవి పెడుతున్నారు. ఆయన వస్తే మంచిదే.

రాజకీయాల్లో నెట్టుకు రావడం అంత సులభం కాదని శరత్‌కుమార్ లాంటి వారు అన్నారు. అనుభవ పూర్వకంగా మీరు ఏమంటారు?
ఎమంటాను. ఏమీ అనను... (కాసేపు ఆగి) ఎంత చేసినా ప్రజలకు విశ్వాసం లేదు. నేను నిలబడ్డ ఊరిలో చాలా గ్రామాల్ని దత్తత తీసుకుని బాగుచేశా. అలాగే మిగిలిన ఊరుల్లోని గ్రామాలను బాగు చేసా. రాజకీయ నాయకునిగా పదికోట్లు పోగొట్టుకున్నా.

ఆనాడు ఎలక్షన్‌లో నిలబడితే ఓడించారు. అందరూ ఓటుకు 150 ఇస్తున్నారు. మనం కూడా ఇవ్వాలి అన్నారు నాయకులు. ఇదా రాజకీయం అంత చేసిన డబ్బులిస్తేనే ఓటు వేస్తారా... ఇప్పుడు రాజకీయాలు లేవు. ఏమీలేవు. హాయిగా నమ్ముకున్న ఇండస్ట్రీలో ఉన్నా. ఇప్పుడు మా ఊరినుంచి వచ్చినవారు నాయుడుగారూ తప్పయ్యింది. ఈసారి తప్పకుండా గెలిపిస్తాం. మీరు పోటీచేయండి అంటున్నారు. కానీ నేను అస్సలు రాజకీయాల జోలికి పోను.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments