Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నాగ్‌"తో సంబంధం దైవ నిర్ణయం : శివప్రసాద్ రెడ్డి

Webdunia
మంగళవారం, 3 ఫిబ్రవరి 2009 (17:30 IST)
WD
కామాక్షీ మూవీస్ అనగానే గుర్తుకొచ్చేది... ఆ చిత్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి. తన సినీ కెరీర్‌లో అక్కినేని నాగార్జునతోనే ఎక్కువగా చిత్రాలు నిర్మించారు. అలాగని మిగిలిన హీరోలంటే ద్వేషం కాదంటున్నారు. చిరంజీవి, బాలయ్య, బాబు కూడా తన యోగక్షేమాలు అడుగుతుంటారని చెబుతున్నారు.

ఎలాగో ఏర్పడిన పరిచయం నాగ్‌తో ఇలానే కొనసాగుతుందని ఆయన తాజాగా నాగ్ కుమారుడు నాగచైతన్యతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాగ్ నటిస్తోన్న "కింగ్" చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు.

ప్రశ్న... వరుసగా నాగార్జునతోనే చిత్రాలు తీయడానికి కారణం?
జ... దాదాపు 24 ఏళ్ళ పరిచయం. ఎప్పుడో ఏర్పడిన పరిచయం ఇలా కుదిరింది. 1985లోనే "విక్రమ్" షూటింగ్‌కు ముందే నాగ్ నాకు తెలుసు. నేనప్పుడు శ్రావణ సంధ్య, కార్తీక పౌర్ణమి చిత్రాలు చేస్తున్నాను. ఆయనతో ఏర్పడిన పరిచయంతో "విక్కీదాదా" తీశాను. ఆ తర్వాత మిగిలిన హీరోలతో "ముఠామేస్త్రీ", "అల్లరి అల్లుడు" చిత్రాలు తీశాను.

దైవ నిర్ణయంతో నాగార్జునకు నాకు స్నేహం ఏర్పడిందనుకుంటా. మా కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు కలిసిపోతాం. మా అబ్బాయి నిఖిల్, నాగచైతన్య కూడా మంచి స్నేహితులు. ఇది ఫలానా కారణం అని ప్రత్యేకంగా చెప్పలేం. నా సినిమా అంటేనే.. స్వంత ప్రాజెక్టుగా ఫీలై అన్నీ ఆయనే చూసుకుంటారు. మా ఇద్దరి మధ్య ఎటువంటి క్లాష్ రాలేదు. నాగ్‌తో నిర్మాతగా గర్వపడుతుంటాను.

ప్రశ్న... ఎవరికి కింగ్? ఏం చేస్తుంటాడు?
జ... రాజ వంశీయులకు సంబంధించిన వారసుడే ఈ కింగ్. రాజ్యాలు లేకపోయినా ఆ వాసనలు ఇంకా ఉంటాయి. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పటి పరిస్థితులకనుగుణంగా ఎలా మార్పు చెందాడు? అవి ఏమిటి? అనేదే సినిమా. ఇందులో ట్విస్ట్‌లు బాగుంటాయి.

ప్రశ్న.... "కింగ్" చిత్రానికి హీరోయిన్ల సహకారం ఎలా ఉంది?
జ... మొదటి హీరోయిన్ త్రిష. సింగర్‌గా తన యాంబిషన్‌ను చేరుకోవాలనే పాత్ర ఆమెది. మమతామోహన్ దాస్‌దీ ప్రాధాన్యమైన పాత్రే. ఆమెపై ఓ సాంగ్ ఉంటుంది. మిగిలినవి త్రిష కాంబినేషన్. వీరిద్దరూ చాలా సహకరించారు. తను గొప్ప నటిననే గర్వం త్రిషలో ఏమాత్రం కనబడదు. ఓ రోజు దాదాపు ఆరు గంటలు గడిచినా ఆమెపై సన్నివేశం రాకపోతే అలాగే ఓపిగ్గా పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసింది. ఆ తర్వాత షాట్ అనగానే వెంటనే వచ్చి పాల్గొంది. ఏ మాత్రం అసహనం కన్పించలేదు. అదే తీరు మమతామోహన్‌దాస్‌ది.

ప్రశ్న... దర్శకుడి పనివిధానం ఎలా అనిపించింది?
జ... శ్రీనువైట్ల దర్శకుని పనితనం చాలా నచ్చింది. ఇంతకుముందు ఎందుకు పరిచయం కాలేదా? అనిపించింది. నేను చాలా దర్శకులను పరిశీలించాను. కోదండరామిరెడ్డితో ఆరు చిత్రాలు చేశాను. ఆ తరమంతా ఒక తరహా అయితే... అన్ని తరాలను సరిపడే తత్త్వంలా శ్రీనువైట్ల ప్రవర్తన ఉంటుంది.

ప్రశ్న... మళ్ళీ ఆ దర్శకుడితో చిత్రాన్ని చేస్తున్నారా?
జ... చేస్తున్నాను. అది వచ్చే ఏడాది చేసే అవకాశముంది. నాగచైతన్య హీరోగా మా అబ్బాయి నిర్మాణ సారధిగా ఆ చిత్రం ప్రారంభమవుతుంది. శ్రీనువైట్ల మంచి కథ ఉందని చెప్పారు. అది ఇంకా ఫైనల్ కాలేదు. అంతా కుదిరాకే చేస్తాం.

ప్రశ్న.. నిర్మాతగా మీ టార్గెట్?
జ... టార్గెట్ అంటూ ఏమీలేదు. ఇలాగే నాగ్‌తో చిత్రాలు చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న... "బాస్" నిరుత్సాహపర్చింది కదా?
జ... అవును. ఆ చిత్రం డిసపాయింట్ కలిగించింది. ఏదో చేయాలని ఏదో చేశాం. మన్మథుడు ఛాయలు కన్పించాయని అన్నారు. "అన్నమయ్య" తర్వాత నాగార్జునకు ఐదు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. వాటిని అధికమించడానికి కొత్తదనంగా "బాస్" నిర్మించాం. కానీ కథలో ఏదో లోపించి పక్కదారి పట్టింది.

ప్రశ్న... మరి "కింగ్"లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జ... తప్పకుండా మంచి చిత్రమవుతుంది. అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ఫ్యాన్స్‌కే కాకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుంది. "హలోబ్రదర్స్"ను కొత్త యాంగిల్‌లో చూసినట్లుంటుంది. చాలా భారీ చిత్రం. 40 మంది ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. మంచి పంచ్‌ డైలాగ్‌లున్నాయి. దేవీశ్రీ మ్యూజిక్ కూడా ఉంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments