Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చిరంజీవి"కే నా ఓటు : సుమన్

Webdunia
శుక్రవారం, 4 జులై 2008 (14:45 IST)
WD PhotoWD
ఫిలిం ఇండస్ట్రీని దేవాలయంగా అభివర్ణిస్తున్నారు నటుడు సుమన్. బ్లాక్ బెల్ట్ కరాటే హోల్డర్ అయిన సుమన్ ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన జీవితంలో కొన్ని చేదు సంఘటనల వల్ల నటనకు దూరమైనా ఆ తర్వాత మళ్ళీ విభిన్న వేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తను చేస్తుంది ఓ పాత్ర అయినా న్యాయం చేసేవారు. అందుకే ఎంత చిన్న నిర్మాత వచ్చి అడిగినా వెంటనే అంగీకరించేవారు. అందుకే చిన్నచితకా చిత్రాలనే తేడాలేకుండానే నటించేవారు. అదే ఆయన్ను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేట్లుగా చేసింది. సినీ ఫీల్డులో కొద్దికాలం ఏ నటుడైనా కన్పించకపోతే సినిమాలకు దూరమయ్యారనే వార్తలు వస్తుంటాయి.

అలాంటి వాటికి అవకాశం కల్పించకుండా సుమన్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అదే ఆయనకు ప్లస్ అయింది. రజనీకాంత్ నటించిన "శివాజీ" చిత్రంలో ప్రతినాయకుడిగా వేషం వచ్చేలా చేసింది. శంకర్ ఆయన్ను పిలిపించి తొలిసారిగా విలన్ వేషం ఇవ్వడం, దానికి ఆయన న్యాయం చేయడంతో ఆ సినిమా హిట్ తర్వాత అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు.

తెల్లచొక్కా లుంగీతో వెరైటీ విలన్‌గా కనిపించిన సుమన్ ఆ చిత్రంలో పాత్ర తన కెరీర్‌ను మరో మైలురాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. ఆ చిత్రం తర్వాత "డెత్ అండ్ లైవ్" అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటించారు. అది బాగానే ఆడుతుందని సుమన్ అంటున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఆయన "అడుగు" అనే తెలుగు చిత్రంలో నటించడానికి హైదరాబాద్ వచ్చారు. దర్శకుడు కథ చెప్పిన విధానం నచ్చిందనీ, చెన్నైలో ఉన్న తనను పిలిపించి... ఈ పాత్ర మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పడంతో నచ్చి ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు...

WD PhotoWD
ప్రశ్న... అందరూ తెలుగురంగంలో వస్తుంటే మీరు ఇతర రంగాలపై దృష్టి పెట్టడానికి కారణం?
జ... అదేమీ లేదండీ.. ఇతరభాషల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో బీజీగా ఉన్నాను. హాలీవుడ్ చిత్రంలోనూ నటించాను. నా అనుభవం రీత్యా తెలుసుకున్నదేమంటే... ఇండస్ట్రీ అనేది దేవాలయం లాంటిది. దేవాలయంలోకి పేదవాడు రావచ్చు, కోటీశ్వరుడు రావచ్చు.

ఎంతస్థాయిలో ఉన్నవాడైనా దేవుణ్ని అందరితో కలిసే చూస్తాడు. ఇండస్ట్రీ అంటేనే కులమతాలకు అతీతంగా, భాషా ప్రాంతాల కతీతంగా ఆహ్వానం పలుకుతుంది. తమకున్న టాలెంట్‌ను చూపించుకుపోతే ఎప్పుడో ఓసారి మంచి గుర్తింపు వస్తుంది. అంటే మన బండి వచ్చేదాకా ఆగాలి.

అప్పటి వరకు ఓపిక, సహనం ఉండాలి. దీనికితోడు అదృష్టం కూడా ఉండాలి. నా కెరీర్‌లో ఎంతో మందిని చూశాను. నటుడు కావలని వచ్చిన వాడు దర్శకుడు అయ్యాడు. డైరక్టర్ అవ్వాలని కోరికతో అడుగుపెట్టి నటుడయ్యారు. ఇలా రకరకాల ఆలోచనలతో వస్తూ ఈ రంగంలో ఏదోవిధంగా సెటిల్ అయిన వారిని చూశాను. ఇదొక కల్పవృక్షం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.

ప్రశ్న... హీరోగా వేసి చిన్నచితకా వేషాలు వేయడానికి కారణం?
జ.. ఇండస్ట్రీలో మనం ఉన్నామా... లేదా అనేది కావాలి. ఒకప్పుడు హీరోగా చేశాను. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడంతా కుర్రకారు వస్తున్నారు. అప్పుడు నేను చేశానంటే నేను యువకుడ్నే కదా. వయస్సు రీత్యా వస్తున్న వ్యత్యాసం వల్ల అలాంటి పాత్రలు చేయలేను. అందుకే తండ్రిగా, అన్నగా పలు పాత్రలు పోషిస్తున్నాను. నాకు నచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలుసు. అలా చేసుకోబట్టే... ఇంకా సుమన్ ఉన్నాడని దర్శకుడు శంకర్ పిలిపించి మరీ "శివాజీ"లో వేషం ఇచ్చారు. ఇటువంటి పాత్రలే చేస్తాను. అనే నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు.

ప్రశ్న... రాజకీయ బాధ్యతలు స్వీకరించే ఆలోచన ఉందా?
జ... ఇప్పటికి లేదు. రాజకీయ రంగంలో ఉంటే పూర్తి న్యాయం చేయాలి. ఏదో సరదాగా కాసేపు ప్రచారానికో వెళ్ళి మళ్ళీ షూటింగ్‌లకు పోతుంటే దేనికీ సరైన న్యాయం చేయలేం. నేను గతంలో తెదేపాలో పనిచేశాను. కానీ నాకంటూ కుటుంబం అనేది ఉంది. పూర్తికాలం చేయలేనని అప్పుడే చంద్రబాబు గారితో చెప్పాను.

ప్రశ్న... చిరంజీవి రాజకీయ ప్రవేశంపై మీరేమంటారు?
జ... తప్పకుండా ఆయన నా ఓటు. ఆయన రావడం ఆహ్వానించదగిందే. ఎందుకంటే. ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక ప్రతినిధి రావడం గర్వకారణం. గతంలో ఎన్‌.టి.ఆర్ వచ్చారు. ఆయన చేసిన సంక్షేమ అందరూ అభినందించారు. ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఛామింగ్ పర్సనాలిటీ రాలేదు.

ప్రస్తుతం చిరంజీవి నటుడిగా మాస్ ఫాలోయింగ్ ఉంది. అటు పలు సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ చేరువయ్యారు. పార్టీపెట్టి సేవచేసే స్టామినా ఆయనకుంది. ఒకరకంగా ఇండస్ట్రీకి చేయాల్సిన పనులు ప్రభుత్వాలు చేయడం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపంలో ఆదాయం వస్తుంది.

అదంతా ఇండస్ట్రీకి వెచ్చించడంలేదు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి వస్తే మా వాయిస్ విన్పించడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చిరంజీవి రావడం సమర్థనీయం. ఆయన ఎప్పుడు వస్తారు. ఏమిటి అనేది ఇంకా నిర్ణయాలు జరుగుతున్నాయి.. కనుక... ఆయన రైలు వచ్చాక ఆ బోగీలో నేనుకూడా ప్రయాణిస్తా...!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments